శేఖర్ కమ్ములతో మరో మూవీ!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు కుబేర మూవీతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jun 2025 7:22 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు కుబేర మూవీతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో పాటు కీలక పాత్ర పోషించారు. సీబీఐ ఆఫీసర్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి తనదైన శైలిలో మెప్పించారు.
ముఖ్యంగా కొన్ని సీన్స్ లో కళ్లతో హావభావాలు పలికించి ఫిదా చేశారు. స్టార్ హీరో అయినా.. మరో హీరో పక్కన క్యారెక్టర్ రోల్ లో కనిపించి అబ్బురపరిచారు. తన టాలెంట్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన కుబేర సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తాను శేఖర్ కమ్ముల కోసమే కుబేర మూవీకి ఓకే చెప్పానని మరోసారి రివీల్ చేశారు నాగార్జున. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు చెప్పారు. శేఖర్ పై ఉన్న నమ్మకం అలాంటిదన్నారు. ఆయన తీసిన సినిమాలన్నీ తాను ఇప్పటికే చూశానని.. రోల్స్ ను ఏ విధంగా తీర్చిదిద్దుతారో అందరికీ తెలుసని నాగ్ అన్నారు.
అయితే కుబేర స్టోరీని తాను వినగానే తనదే మెయిన్ రోల్ అని అనిపించినట్లు చెప్పారు నాగార్జున. అదే సమయంలో ప్రతి ఒక్కరి పాత్ర తన రోల్ చుట్టూ తిరుగుతుందనిపించినట్లు పేర్కొన్నారు. స్క్రీన్ స్పేస్ వేరే నటీనటులకు ఎక్కువగా ఉండొచ్చని, దానిని తాను అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదని.. పట్టించుకోనని కూడా అన్నారు.
శేఖర్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ హిట్స్ అయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు మరో విజయం సాధించారని, కుబేరలో తనకు ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. అద్భుతమైన పాత్ర తనకు ఇచ్చినట్లు చెప్పారు. సినిమా అందరికీ బాగా నచ్చిందని, చాలారోజుల తర్వాత అందరి నుంచి పాజిటివ్, హిట్ రివ్యూస్ వచ్చినట్లు పేర్కొన్నారు.
తాను, శేఖర్ అప్పుడప్పుడు కలుస్తుంటామని చెప్పిన నాగ్.. తనతో స్టైలిష్ సినిమా చేయాలనుందని ఆయన చెబుతుండేవారని వెల్లడింంచారు. అయితే రొటీన్ మూవీలకు దూరంగా ఒక కొత్త పాత్ర పోషించాలనే తనకు ఆశ ఎప్పటి నుంచో ఉందని, అది కుబేరతో తీరిందని చెప్పారు. సినిమా కోసం శేఖర్ కమ్ముల ప్రాణం పెట్టారని, తమ కాంబోలో మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.
