ఏపీలో కుబేర టికెట్ రేట్ల పెంపు.. ఇప్పుడు ధర ఎంతంటే?
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కుబేర.
By: Tupaki Desk | 19 Jun 2025 4:04 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కుబేర. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. పాన్ ఇండియా రేంజ్ లో కుబేర సినిమాను జూన్ 20వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. అయితే ఆడియన్స్ లో సినిమాపై ముందు నుంచే బజ్ నెలకొనగా.. ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో నెలకొల్పారు మేకర్స్.
అయితే సెన్సార్ బోర్డు.. కుబేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బోర్డు సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసిన తర్వాత 182 నిమిషాల 38 సెకన్ల రన్ టైమ్ తో కుబేరను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు మేకర్స్. మూడు గంటలకు పైగా సినిమా ఉండనుంది. తెలుగులో ఒక నిమిషం తక్కువ రన్ టైమ్ తో రిలీజ్ కానుంది.
కాగా, విడుదలకు మేకర్స్ అన్ని ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేయగా.. ఇప్పుడు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రేట్ల పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.75 (జీఎస్టీ అదనం) వరకు కూడా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కల్పించింది.
దీంతో సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.236 వరకు.. మల్టీప్లెక్స్ లో ధర రూ.265.50 వరకు టికెట్లు రేట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే సినిమా రిలీజ్ అయిన తేదీ నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరలు అమల్లో ఉండేలా అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అయితే తెలంగాణలో టికెట్ ధరల విషయంలో మార్పు లేదని తెలుస్తోంది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కుబేర ప్రీ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయని సమాచారం. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. సోషల్ డ్రామా రానున్న సినిమా కంటెంట్ పై అంతా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.. కుబేర ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందనేది..
