Begin typing your search above and press return to search.

కుబేర.. మరో పని పూర్తయింది..

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కుబేర.

By:  Tupaki Desk   |   15 Jun 2025 7:28 AM
కుబేర.. మరో పని పూర్తయింది..
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కుబేర. ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహంచిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కుబేర కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అందుకు ముఖ్య కారణం.. మేకర్స్ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్. పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్సెస్ అన్నీ వేరే లెవెల్ లో అలరించి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

అయితే మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పుడు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందారు. ఫైనల్ మూవీ రన్ టైమ్.. 181 నిమిషాలుగా తెలుస్తోంది. అంటే కుబేర సినిమా నిడివి.. మూడు గంటల ఒక నిమిషం అన్నమాట.

నిజానికి.. కొద్ది రోజుల మేకర్స్ సెన్సార్ బోర్డును సంప్రదించారు. ఆ సమయంలో యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులు.. రన్‌ టైమ్ విషయంలో అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది. మూడు గంటల 15 నిమిషాల కాపీని మేకర్స్ సబ్మిట్ చేశారట. అప్పుడు అభ్యంతరాలు తెలపడంతో ఇప్పుడు రన్ టైమ్ ను ట్రిమ్ చేసి పంపారని టాక్.

అలా మొత్తానికి సెన్సార్ పనులను కుబేర మేకర్స్ కంప్లీట్ చేశారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శుక్రవారం నిర్వహిస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా ఆ ఈవెంట్‌ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రముఖ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లుగా, చైతన్య పింగలి సహ రచయితగా వ్యవహరించారు. కాస్ట్యూమ్స్‌ను కావ్య శ్రీరామ్, పూర్వా జైన్ రూపొందించారు. మరి కుబేర మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.