కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో అదుర్స్..!
కుబేర సినిమా తో పాటు ధనుష్ ఇడ్లీ కొడై సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ధనుష్ డైరెక్షన్ లో వస్తుంది.
By: Tupaki Desk | 15 April 2025 7:41 PM ISTశేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో మన కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. కుబేర సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు.
కుబేర సినిమా నుంచి పొయ్ రా.. పొయ్ రా మామా అంటూ సాంగ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోతోనే సాంగ్ పై ఒక మంచి బజ్ క్రియేట్ చేశారు. దేవి మ్యూజిక్ అంటే ఇన్ స్టంట్ గా ఎక్కేస్తాయి. అందులో భాగంగానే కుబేర ఫస్ట్ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఈ సాంగ్ ని ధనుష్ ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కుబేర సినిమా సాంగ్ ప్రోమోకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో ధనుష్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున రోల్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల ఈ కథను ఆయన స్టైల్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. రాయన్ తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ కుబేర సినిమాతో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.
కుబేర సినిమా తో పాటు ధనుష్ ఇడ్లీ కొడై సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ధనుష్ డైరెక్షన్ లో వస్తుంది. కుబేర సినిమాను తెలుగు తమిళంతో పాటు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ కాగా అందుకు తగినట్టుగానే సినిమా నుంచి ప్రచార చిత్రాలు వస్తున్నాయి. ధనుష్ నాగార్జున రష్మిక మందన్న ఈ స్టార్ కాంబినేషన్స్ తో వస్తున్న కుబేర సినిమా సంథింగ్ స్పెషల్ కానుంది. తప్పకుండా ఈ కాంబో అంచనాలను అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
శేఖర్ కమ్ముల సినిమా అంటే తప్పకుండా ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటుంది. అందులోనూ ధనుష్ తో శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ కుబేర మీద భారీ హైప్ ఏర్పడింది. మరి ఈ సినిమాపై ఉన్న ఈ ఎక్స్ పెక్టేషన్స్ కి తగిన ఫలితం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రోమో మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు.
