'కుబేర' హైప్‌కి కారణం తనేనా?
తమిళ వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా `కుబేర`. తెలుగులో ధనుష్ నటించిన రెండవ సినిమా ఇది.
By: Tupaki Desk | 9 Jun 2025 5:32 AMతమిళ వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా `కుబేర`. తెలుగులో ధనుష్ నటించిన రెండవ సినిమా ఇది. సెన్సిబుల్ మూవీస్‌తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించగా, కథకు కీలకమైన క్యారెక్టర్‌లో కింగ్ నాగార్జున నటించడం గమనార్హం. ఉత్తరాది మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకుని హిందీ నటులని కూడా కీలక పాత్రల కోసం తీసుకున్నారు.
ఓ బిచ్చగాడికి ఓ అపర కోటశ్వరుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని, బిచ్చగాడుగా ధనుష్, కోటీశ్వరుడిగా కింగ్ నాగార్జున నటిస్తున్నారని, వరిద్దరి క్యారెక్టర్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఈ నెల 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతూ వస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ఆంధ్రా హక్కులను భారీ మొత్తంలో కోట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల కథనం. గతంలో ధనుష్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ ఉండేది కాదు. కానీ `కుబేర`కు మాత్రం విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది.
దీనికి ప్రధాన కారణం కింగ్ నాగార్జున అని తెలుస్తోంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో హైప్‌ని, బిజినెస్ పరంగా భారీ క్రేజ్‌ని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. బిజినెస్ పరంగా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫలితం విషయంలో అక్కినేని అభిమానులు చాలా కన్ఫిడెంట్‌గా ఉన్నారట.
దీనికి తోడు `రఘువరన్ బీటెక్`, సార్ వంటి సినిమాలతో ధనుష్ కూడా తెలుగులో మంచి మార్కెట్‌ని క్రియేట్ చేసుకోవడం, వీరిద్దరి స్టార్ ఇమేజ్‌కు శేఖర్ కమ్ముల క్రేజ్ కూడా తోడవ్వడంతో `కుబేర` షూర్ షాట్ హిట్ అని అంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయం అని ఇన్ సైడ్ టాక్. ప్రీ రిలీజ్ బజ్ పతాక స్థాయికి చేరిన ఈ మూవీ జన్ 20న అంతా ఆశించినట్టుగానే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.