Begin typing your search above and press return to search.

కుబేర బాక్సాఫీస్.. రెండో ఆదివారం కూడా అదే జోరు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఎమోషనల్ డ్రామా కుబేర సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 2:09 PM IST
కుబేర బాక్సాఫీస్.. రెండో ఆదివారం కూడా అదే జోరు
X

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఎమోషనల్ డ్రామా కుబేర సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ నటుడు ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వంటి త్రయం ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించడంతో ఫస్ట్ లుక్ నుంచి రిలీజ్ వరకు భారీ బజ్ నెలకొంది. అదే హైప్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలోకి మారింది.

ప్రస్తుతం ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినా.. వసూళ్లు మాత్రం తగ్గే ఆలోచనలే లేకుండా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రెండో ఆదివారం రోజున బుక్ మై షో లో 67 వేలకు పైగా టికెట్లు బుక్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈమధ్య కాలంలో మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ లెక్కలు చూస్తే కుబేర క్రేజ్ ఇంకా పీక్స్‌లో ఉందని చెప్పాల్సిందే.

ధనుష్, నాగార్జునల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్స్ కాగా, శేఖర్ కమ్ముల శైలిలో వచ్చిన ఎమోషనల్ టచ్ సినిమా బలంగా నిలిచింది. రష్మిక పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని దక్కించుకుంది. పాటలు, నేపథ్య సంగీతం పరంగా దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడు. ప్రతి బీట్లోనూ ఈ సినిమా ఓ ఫీల్‌ను అందించగలిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు దాదాపు 123 కోట్ల గ్రాస్‌ను దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తమిళంలో ఫలితం తక్కువగా ఉన్నా.. తెలుగు వెర్షన్ సెన్సేషనల్ హిట్‌గా నిలుస్తోంది. ధనుష్ కెరీర్‌లో తెలుగులో ఇదే ఆల్ టైమ్ బెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇది ఆయనకు మన ఇండస్ట్రీలో మరింత క్రేజ్ తెచ్చే అవకాశం కూడా.

ఇక ప్రస్తుత ట్రెండ్ చూస్తే కుబేర మూవీ లాంగ్ రన్‌లో మరో 10, 15 కోట్ల వరకు అదనంగా రాబట్టే అవకాశం ఉంది. దీనితోపాటు రీజినల్ మార్కెట్లు, ఓటీటీ హక్కులతో కూడిన రివెన్యూ కలిపితే సినిమా భారీ లాభాల్లోకి వెళ్లే ఛాన్సుంది. ఈ సక్సెస్‌తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా లెవల్లో తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక రెండో వారం కూడా కుబేర సినిమా దూకుడు తగ్గకుండా ముందుకు సాగుతుండడం ట్రేడ్ వర్గాల్లో సంతోషాన్ని రేపుతోంది. బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులు ఇంత భారీ స్థాయిలో టికెట్లు బుక్ చేయడం సినిమా వసూళ్ల భవిష్యత్తును బలంగా చూపిస్తోంది.