షూటింగ్ టైమ్ లో ధనుష్ తో ప్రేమలో పడ్డా
ప్రమోషన్స్ లో భాగంగా రిలీజైన టీజర్ తో పాటూ నాడి నాడి సాంగ్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 5:55 PMశేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా కుబేర. ఏషియన్ సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ క్లాసికల్ డ్రామా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేశారు.
ప్రమోషన్స్ లో భాగంగా రిలీజైన టీజర్ తో పాటూ నాడి నాడి సాంగ్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా కుబేర ఆడియో లాంచ్ చెన్నైలో జరగ్గా దానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఎంతో మంది ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ ఆడియో లాంచ్ లో రష్మిక ఎంతో అందంగా కనిపించింది. ఒకే సినిమాలో ఇంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం తన అదృష్టమని చెప్పిన రష్మిక, కుబేర ప్రపంచంలో తనను కూడా భాగం చేసినందుకు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే ధనుష్ తో కలిసి ఓ రొమాంటిక్ సినిమాలో నటించాలనుకుంటున్నట్టు కూడా రష్మిక చెప్పింది.
కుబేర లాంటి క్లాసికల్ ఫిల్మ్ ను వెండితెరపైకి తీసుకురావడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పిన శేఖర్ కమ్ముల, షూటింగ్ టైమ్ లో తాను ధనుష్ తో ప్రేమలో పడ్డానని చెప్పారు. కుబేర చాలా చాలా బ్రిలియంట్ సినిమా అని, ఈ సినిమా కోసం ప్రతీ ఒక్క టెక్నీషియన్ ఎంతగానో కష్టపడి పని చేశారని, ఈ సినిమాకు మరోసారి ధనుష్ కు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు.
మొదటి నుంచీ తనకు టాలెంటెడ్ వ్యక్తులతో పని చేయడమంటే ఇష్టమని చెప్పిన నాగార్జున, ధనుష్ చాలా టాలెంటెడ్ అని పేర్కొన్నారు. తనకు చెన్నైతో ఎంతో అనుబంధముని తెలిపిన నాగార్జున ధనుష్, శేఖర్ తో కలిసి మళ్లీ వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అదే సందర్భంగా తనతో డైరెక్టర్ గా ఎప్పుడు సినిమా చేస్తావని కూడా ధనుష్ ను నాగార్జున అడిగారు.
తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎంతో బాగా మాట్లాడిన ధనుష్, తనకేం జరిగినా తన ఫ్యాన్స్ ముందుంటారని చెప్పాడు. ఈ రోజుల్లో శేఖర్ కమ్ముల లాంటి స్వచ్చమైన మనుషులు ఉండటం చాలా అరుదని, అతని అమాయకత్వం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు. తన కెరీర్ లో కుబేర ఒక అడిషనల్ ఎట్రాక్షన్ గా మారనుందని చెప్పిన ధనుష్, ఈ సినిమా కచ్ఛితంగా బ్యాక్ బస్టర్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.