కుబేర: దేవి హై వోల్టేజ్ బీట్స్ లో 'అనగనగా కథ'
ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించనున్నట్లు టీజర్ హైలెట్ చేసింది.
By: Tupaki Desk | 3 Jun 2025 10:12 AM ISTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా విడుదల విషయంలో కాస్త ఆలస్యంగా వస్తున్నప్పటికీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. లీడర్ తరువాత మళ్ళీ అలాంటి ఫీల్ కలిగిస్తోన్న కమ్ముల తప్పకుండా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఓ వర్గం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషల్ థ్రిల్లర్, సమాజంలోని ఆర్థిక అసమానతలు, అధికార ఆకాంక్షల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
జిమ్ సర్భ్, దలీప్ తాహిల్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో తొలిసారి నాగార్జున, ధనుష్ కలిసి నటిస్తుండటంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏషియన్ సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాణంలో ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ‘పోయిరా మామా’ సాంగ్‌తో అభిమానులను ఆకర్షించింది.
ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించనున్నట్లు టీజర్ హైలెట్ చేసింది. సినిమా సమాజంలో అంతరాలు, ఆర్థిక వ్యవస్థపై ఆలోచింపజేసే కథనంతో రూపొందుతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘అనగనగా కథ’ విడుదలై, అందరినీ ఆకట్టుకుంటోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘అనగనగా కథ’ సాంగ్, రాక్ బీట్స్‌తో సమాజ సత్యాలను తెరపైకి తెచ్చింది. హైడ్ కార్టీ, కరీముల్లా ఆలపించిన ఈ పాట, ధని పేద అంతరాలను, అణచివేతను గురించి ఆలోచింపజేసేలా ఉంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన సాహిత్యం అత్యంత అర్థవంతంగా, సినిమా కథను ప్రతిబింబించేలా ఉంది. ఈ పాట సమాజంలోని ఆర్థిక వ్యత్యాసాలను, అణగారిన వర్గాల బాధలను తీవ్రంగా చూపిస్తూ, ఆలోచనలో ముంచెత్తింది.
లిరికల్ వీడియోలో ఉపయోగించిన ఫోటోల్లో నాగార్జున, ధనుష్ కెమిస్ట్రీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా పాత్రల వివరాలు స్పష్టంగా తెలియకపోయినా, వీరిద్దరి పాత్రల తీవ్రత అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ సాంగ్ సినిమా కథను మరింత లోతుగా పరిచయం చేస్తూ, ఆర్థిక డ్రామాకు సరైన నేపథ్యాన్ని సిద్ధం చేసిందని అభిమానులు అంటున్నారు.
ఈ సినిమా జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల సాధారణంగా రొమాంటిక్ డ్రామాలతో మ్యాజిక్ చేయగలడు, కానీ ఈసారి సమాజంలోని ఆర్థిక అసమానతలపై ఒక థ్రిల్లర్‌గా ‘కుబేర’ను తెరకెక్కించాడు. మొత్తంగా, ‘అనగనగా కథ’ సాంగ్ ‘కుబేర’ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక సినిమా విడుదల అనంతరం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
