రూ.100 కోట్ల హిట్ 'కుబేర'.. ఎదురు చూపులకు తెర
కుబేర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్.
By: Tupaki Desk | 11 July 2025 3:36 PM ISTధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో పాటు, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ మూవీగా కుబేర ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. చాలా తక్కువ సమయంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కుబేర సినిమాకు తమిళనాడులో మాత్రం ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు. వసూళ్ల విషయంలోనూ అక్కడ నిరాశే మిగిలింది. తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మంది థియేట్రికల్ రిలీజ్ అయిన సమయంలో కుబేర ను చూశారు. కానీ తమిళ్ ఆడియన్స్‌లో ఎక్కువ శాతం మంది కుబేర ను ఓటీటీలో చూడటం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కుబేర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. జూన్ 20న థియేటర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కుబేర' సినిమా ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఒప్పందం జరిగింది. రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వసూళ్లు సాధించింది. మూడో వారంలో పెద్దగా వసూళ్లు నమోదు కావడం లేదు. దాంతో నాల్గవ వారంలో కుబేర సినిమాను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయడంకు రెడీ అయింది.
తాజాగా అమెజాన్ ప్రైమ్ నుంచి కుబేర సినిమా స్ట్రీమింగ్ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. జులై 18వ తారీకున కుబేర సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను స్ట్రీమింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు చెప్తారు. కానీ ఈ సినిమాకు మాత్రం వారం ముందే అధికారికంగా ప్రకటన చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. అందుకే కుబేర సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. థియేటర్‌లో చూసిన వారు, చూడని వారు కూడా కుబేర ను అమెజాన్ ప్రైమ్‌లో జులై 18న చూసేందుకు ఎదురు చూస్తున్నారు.
ధనుష్‌ను ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో చూపించాడు. ఒక పెద్ద ఆర్థిక నేరం కు పాల్పడేందుకు గాను బిచ్చగాళ్లను పావులుగా వినియోగించుకుంటారు. ఈ సినిమాలో నాగార్జున విభిన్నమైన పాత్రలో కనిపించాడు. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో నాగార్జున నటన ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ధనుష్ చేస్తున్న సినిమాలు దేనికి అదే అన్నట్లుగా ఉంటున్నాయి. ఈ సినిమా కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంది. రష్మిక మందన్న ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో స్కిన్ షో కు ఛాన్స్ లేదు, రొమాంటిక్ సాంగ్స్‌కు అవకాశం లేదు. అయినా కూడా ఈ సినిమాతో రష్మిక మందన్న కి మంచి పేరు దక్కింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత మరింతగా జనాల్లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.
