Begin typing your search above and press return to search.

కుబేర విషయంలో స్టార్ హీరో హ్యాపీనా..?

సార్ తర్వాత మరో తెలుగు దర్శకుడితో కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 May 2025 2:45 AM
కుబేర విషయంలో స్టార్ హీరో హ్యాపీనా..?
X

సార్ తర్వాత మరో తెలుగు దర్శకుడితో కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ కుబేర అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్ తో పాటు మన కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడని తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కుబేర సినిమా మొదలు పెట్టి రెండేళ్లు అవుతుంది. సినిమా ఇప్పుడు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది.

ధనుష్ వెరైటీ కథల ఎంపికల గురించి తెలిసిందే. సార్ తర్వాత తెలుగులో మరో సినిమా చేయాలని అనుకుంటున్న టైం లో శేఖర్ కమ్ముల కథ నచ్చి కుబేర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఐతే కుబేర సినిమా నుంచి అంతకుముందు ఒక పోస్టర్ రాగా దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒక టీజర్ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. త్వరలో సినిమా నుంచి మరో కొత్త టీజర్ రాబోతుందని తెలుస్తుంది.

ముగింపు దశకు చేరుకున్న ధనుష్ కుబేర అవుట్ పుట్ మీద హీరో ధనుష్ సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నాడని టాక్. ధనుష్ కి ఉన్న ఇమేజ్ కి తగినట్టుగానే ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ కుబేర సినిమాలో నాగార్జున రోల్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఆయన రోల్ చాలా కీలకం కాగా మూవీ చూశాక ఈ రోల్ కి ఆయన మాత్రమే పర్ఫెక్ట్ అనేలా ఉంటుందట.

అంతేకాదు కుబేర రషెస్ చూసి నాగార్జున కూడా సూపర్ అనేశాడటని చెబుతున్నారు. నా సామిరంగ తర్వాత నాగార్జున మరో సినిమా మొదలు పెట్టలేదు. ధనుష్ కుబేరతో పాటు అటు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో నాగార్జున పాత్ర అక్కినేని ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. కుబేర సినిమాను జూన్ 20న రిలీజ్ లాక్ చేశారు. కుబేర సినిమా చేస్తూనే ధనుష్ తన సొంత డైరెక్షన్ లో ఇడ్లీ కొడై సినిమాను కూడా చేస్తున్నారు. రాయన్ తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ మరోసారి ఇడ్లీ కొడై తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యారు.