రిలీజ్ కు ముందే మళ్లీ 'కుభేర' త్రయం!
అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఇదే త్రయం మధ్య మరో చిత్రం లాక్ అయినట్లు సమాచారం.
By: Tupaki Desk | 10 April 2025 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ములా 'కుభేర' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబై గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రమిది. హీరో ధనుష్ అయినా ఈడీ ఆఫీసర్ పాత్రలో నాగార్జున రోల్ సైతం అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రీకరణ ముగింపు దర్శకు చేరుకుంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి జూన్ 20న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఇదే త్రయం మధ్య మరో చిత్రం లాక్ అయినట్లు సమాచారం. ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల్లా మరో చిత్రం తెరకెక్కించాలని ప్లాన్ చేసారట. దీనిలో భాగంగా ఇటీవలే ముగ్గురి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగిందని వినిపిస్తోంది.
లైన్ నచ్చడండో మళ్లీ కలిసి పనిచేయడానికి నాగ్, ధనుష్ కూడా ఒకే చెప్పారట. దీంతో ఇప్పుడీ త్రయం సంచలనంగా మారింది. కుభేర రిలీజ్ కి ముందే ఒప్పందం కుదిరిందంటే కుభేర పై ముగ్గురు ఎంత కాన్పిడెంట్ గా ఉన్నారు? అన్నది అర్దమవుతుంది. సాధారణంగా శేఖర్ కమ్ములా ఒకసారి పనిచేసిన హీరోతో మళ్లీ పనిచేయరు. కొత్త వాళ్లతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటి వరకూ ఆయన సినిమాలన్నీ అలాగే తెరకెక్కాయి. ఇంత వరకూ ఆయన స్టార్ హీరోలతో సినిమాలే చేయలేదు. చాలా వరకూ కొత్త వాళ్లే కనిపిస్తారు. 'కుభేర' కోసం ధనుష్-నాగార్జునలను ఏకం చేసారు. ఆ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ కమ్ములా బాగా ఆస్వాదించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అదే ద్వయాన్ని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
