కుబేర టీమ్ ఇప్పటికైనా అది గుర్తించాలి
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా కుబేర. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు
By: Tupaki Desk | 5 Jun 2025 1:00 PMకోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా కుబేర. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది.
కుబేర సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై లో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఈ ఈవెంట్ లో ధనుష్, నాగార్జున కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా కుబేర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ తమిళ ఆడియన్స్ లో సెన్సేషన్ సృష్టించినప్పటికీ, తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఆ ఈవెంట్ గురించి తెలియకపోవడంతో ఇక్కడ కుబేరకు ఇంకా ఊహించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు.
దానికి తోడు ఆ ఈవెంట్ లో సదరు సెలబ్రిటీలు ఏం మాట్లాడారనేది కూడా తెలుగు ప్రేక్షకులందరికీ తెలియదు. కుబేర సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ, ఈ సినిమాకు పలు నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించి దాని ద్వారా దేశ వ్యాప్తంగా బజ్ ను క్రియేట్ చేయడంలో మాత్రం చిత్ర యూనిట్ ఫెయిలవుతోంది.
ఈ నేపథ్యంలో ముంబై లో గ్రాండ్ ఈవెంట్ కు చేసిన ప్లాన్ కూడా వర్కవుట్ అయ్యేలా అనిపించడం లేదని ట్రేడ్ నిపుణులంటున్నారు. కుబేర టీమ్ తమ ప్రమోషన్ స్ట్రాటజీలోని లోపాలను ఇంకా గుర్తించలేదని, అందుకే వారు ప్రాంతీయ ప్రమోషన్స్ పై మాత్రమే ఫోకస్ చేస్తున్నారని, అన్ని భాషల ఆడియన్స్ లో కుబేరపై హైప్ ను పెంచడంలో టీమ్ ఫెయిల్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ లో ధనుష్, శేఖర్ కమ్ముల కుబేర సినిమా చాలా బాగా వచ్చిందని, అవుట్ పుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ, సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రభావం కలెక్షన్లపై చూపిస్తుందని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించి కుబేర ప్రమోషన్స్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.