అదే నా ఆల్ టైం బెస్ట్ షాట్ : శేఖర్ కమ్ముల
ధనుష్ హీరోగా నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన సినిమా కుబేర. సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.
By: Tupaki Desk | 16 Jun 2025 4:05 AMధనుష్ హీరోగా నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన సినిమా కుబేర. సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పీచ్ వైరల్ గా మారింది. తన స్పీచ్ లో ఏవైనా మర్చిపోతావేమో అని ఒక బుక్ లో రాసుకుని మరీ స్పీచ్ ఇచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
ముందుగా డైరెక్టర్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం అంటే అది రాజమౌళి వళ్లే అని అన్నారు శేఖర్ కమ్ముల. ఆయన ధైర్యం ఇవ్వబట్టే ఇలాంటి సినిమాలు చేస్తున్నాం అన్నారు. ఈ ఈవెంట్ కి ఆయన రావడం సంతోషంగా ఉందని అన్నారు శేఖర్ కమ్ముల. నాగార్జునజ గారిని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నా అవకాశం వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డా అన్నారు.. ఆయన పెద్ద స్టార్.. ఫస్ట్ టైం ఆయనతో చేశాను.. సినిమా మొత్తంలో ఆయన చాలా సపోర్ట్ చేసారు. ఎన్నో గొప్ప పాత్రల్లో నటించిన నాగార్జున నా సినిమాలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు శేఖర్ కమ్ముల.
నాగార్జున గారు ఈ సినిమా కోసం కొన్నిటిని త్యాగం చేశారు. ఆయన రాత్రిపూట షూట్ చేయకపోయినా ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారు. ఆదివారం కూడా షూట్ చేయరు కానీ కుబేర కోసం చేశారు. ఆయన డెడికేషన్ అలాంటిదని అన్నారు శేఖర్ కమ్ముల. ఇక ధనుష్ లాంటి నటుడు దొరకడని.. చెత్తకుప్పలో షూటింగ్ చేయాలన్నా ఓకే అంటాడు.. ఏది చేయమన్నా అది చేస్తాడు.. అందుకే ఇండియన్ ప్రైడ్ అని అన్నారు శేఖర్ కమంల. అంతేకాదు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ లో ధనుష్ పర్ఫార్మెన్స్ చూసి అదే నా ఆల్ టైం బెస్ట్ సాట్ అనుకున్నానని అన్నారు శేఖర్ కమ్ముల.
హీరోయిన్ రష్మిక మందన్న గురించి మాట్లాడుతూ.. రష్మిక బయట, లోపల ఒకే విధంగా ఉంటుందని అన్నారు. ఇక సినిమా చాల బాగా వచ్చింది. సినిమా పట్ల సంతోషంగా ఉన్నట్టు చెప్పారు నాగార్జున. ఈ సినిమా తప్పకుండా సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అన్నారు.