హైప్ పీక్స్..'కుబేర'తో కమ్ముల కల ఫలిస్తుందా?
శేఖర్ కమ్ముల సినిమాఅంటే ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులున్నారు. ఆయన సినిమాల్లో కంటెంట్‌తో పాటు సన్నితమైన భావోద్వేగాలుంటాయి.
By: Tupaki Desk | 19 Jun 2025 9:00 PM ISTధనుష్ హీరోగా సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యాక్షన్ డ్రామా మూవీ 'కుబేర'. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. అపర కుబేరుడు, ఓ బిచ్చగాడు నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో కుబేరుడిగా నాగార్జున, బిచ్గాడిగా ధనుష్ నటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
ఏపీలో టికెట్ ధరలు పెంచేసినా తెలంగాణలో మాత్రం ఎక్కడా టికెట్ ధరలు పెంచకపోవడం గమనార్హం. టాలీవుడ్ నుంచి ఈ సమ్మర్‌లో భారీ సినిమాలేవీ థియేటర్లలోకి రాకపోవడంతో ఆడియన్స్ తెలుగు నుంచి భారీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రిలీజ్ అవుతున్న'కుబేర'కు ఇది భారీ అడ్వాంటేజ్‌గా మారుతుందని మేకర్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. శేఖర్ కమ్ముల చేసిన సినిమా కావడం, ఇందులో ధనుష్, నాగ్ కలిసి నటించడంతో ప్రారంభం నుంచే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా బిజినెస్ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో జరిగింది. చాలా కాలంగా సరైన సినిమా కోసం ఎదురు చూస్తూ థియేటర్లకు దూరంగా ఉంటున్న ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షోతో 'కుబేర'కు గుడ్ మౌత్ టాక్ మొదలైతే కాసులు వర్షం కురిపించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కొతం కాలంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడం లేదు. రప్పించే సినిమాలు కూడా ఈ మధ్య రిలీజ్ కాలేదు. దీంతో 'కుబేర' గనక ఆడియన్స్‌ని మెప్పించగలిగితే జాక్ పాట్ కొట్టినట్టే.
శేఖర్ కమ్ముల సినిమాఅంటే ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులున్నారు. ఆయన సినిమాల్లో కంటెంట్‌తో పాటు సన్నితమైన భావోద్వేగాలుంటాయి. అంతే కాకుండా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అదే పంథాని కొనసాగిస్తూ శేఖర్ కమ్ముల 'కుబేర'ని రియలిస్టిక్ అప్రోచ్‌తో రూపొందించారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే హైప్ పీక్స్‌కు చేరిన ఈ సినిమాతో శేఖర్ కమ్ముల భారీ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవాలనే కల నెరవేరేనా? అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
