Begin typing your search above and press return to search.

కుబేరలో అదే రియల్ ఛాలెంజ్.. ఫస్ట్ కాపీ అద్భుతం: నిర్మాతలు

మరో వారం రోజుల్లో కుబేర రిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 4:22 AM
కుబేరలో అదే రియల్ ఛాలెంజ్.. ఫస్ట్ కాపీ అద్భుతం: నిర్మాతలు
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న మూవీపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ అందుకుని టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

అయితే శేఖర్ కమ్ముల.. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. మరో వారం రోజుల్లో కుబేర రిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పలు విశేషాలు పంచుకున్నారు.

'కుబేర' ప్రాజెక్టు ఎలా మెటీరియలైజ్ అయింది?

- శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరీ తర్వాత కుబేర ఐడియా మాకు చెప్పారు. ఆ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. కథ కూడా చెప్పారు. ధనుష్ గారు 20 నిమిషాలపాటు స్టోరీ విని వెంటనే సైన్ చేశారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాం.

- ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకు అనుగుణంగా బిగ్ స్టార్ కాస్ట్ తో సినిమా రూపొందించాం. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.

-కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.

శేఖర్ కమ్ముల గారు ఫస్ట్ టైం ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో సినిమా చేస్తున్నారు కదా? ఇది ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది?

- శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కు కొత్త అనుభూతి ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.

- శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ను క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిల్మ్ మేకర్. సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.

కుబేర కాన్సెప్ట్ ఏమిటి?

-మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ ఇది కాన్సెప్ట్

కుబేర కథలో మిమ్మల్ని ఎక్సైజ్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?

- డైరెక్టర్ గారు మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ను టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలు తీస్తారు. కుబేర మూవీ కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి.

షూటింగ్ లో ఎలాంటి ఛాలెంజస్ ఎదుర్కొన్నారు?

- రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నది. ఆ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము. బొంబాయిలో సినిమా షూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాను చిత్రీకరణ జరిగింది. అది రియల్ ఛాలెంజ్.

- మేం బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం.

- సినిమాను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. దాదాపు 1600 స్క్రీన్స్ లో మూవీ రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.

నాగార్జున గారిని ఎలా ప్రాజెక్టులో తీసుకొచ్చారు?

- నాగార్జున గారితో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ గారికి ఆ పాత్ర కోసం నాగార్జున గారు తప్పితే మరొకరు కనిపించలేదు. నాగ్ సర్ కు ఈ కథ నచ్చింది. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఆయన్ని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశారు.

దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?

- దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవిశ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.

తమిళంలో కూడా మీరే రిలీజ్ చేస్తున్నారా?

- లేదు. రాహుల్ అనే డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చాం.

సునీల్ గారు.. మీ అమ్మాయి జాన్విని నిర్మాతగా చేయాలనే భావిస్తున్నారా?

- కచ్చితంగా అండి. తనకి సినిమా నిర్మాణం పట్ల చాలా ఆసక్తి ఉంది. చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మా బ్రదర్ వాళ్ల అబ్బాయి కూడా ప్రొడక్షన్ పై ఆసక్తి ఉంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?

- శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.