విజయ్ కుబేర.. ఆలోచించాల్సిందే..!
ఓ విధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా కాదనడం మంచి పనే అని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 4 July 2025 11:01 PM ISTధనుష్ లీడ్ రోల్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కుబేర. సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఒక దీపక్ అనే పాత్రలో అదరగొట్టారు. శేఖర్ కమ్ముల నాగార్జునని ఎలా ఒప్పించాడో కానీ తెలుగులో కుబేర సక్సెస్ కి ఒక మెయిన్ రీజన్ అయితే నాగార్జున అని చెప్పడంలో సందేహం లేదు. అదేంటో ధనుష్ సొంత అభిమానులు కుబేరని నచ్చలేదు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ధనుష్ పర్ఫార్మెన్స్ కి అతని వర్సటాలిటీని మెచ్చుకుంటున్నారు.
ఇదిలాఉంటే ఈ సినిమా కథగా అనుకున్నప్పుడు శేఖర్ కమ్ముల ధనుష్ దాకా తీసుకెళ్లడానికి ముందు తెలుగు హీరోతో చేయాలని అనుకున్నాడట. శేఖర్ కమ్ముల ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తీస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేశారట. విజయ్ దేవరకొండ కి కథ కూడా చెప్పాడని టాక్. ఐతే రౌడీ ఇమేజ్ ఉన్న తనకు ఇలాంటి కథ సూటవ్వదని విజయ్ సున్నితంగా తిరస్కరించాడట.
ఓ విధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా కాదనడం మంచి పనే అని చెప్పొచ్చు. ఎలాగైతే ధనుష్ ని తమిళ ఆడియన్స్ బిచ్చగాడుగా యాక్సెప్ట్ చేయలేదో మన దేవరకొండ విజయ్ ని కూడా ఫ్యాన్స్ అండ్ ఆడిషన్స్ అలా ఒప్పుకునే అవకాశం ఉండదు. రౌడీ బాయ్ ఇమేజ్ తో డేరింగ్ అండ్ డాషింగ్ గా కనిపించే విజయ్ దేవరకొండ కుబేర సినిమాలో నటిస్తే మాత్రం ఆలోచించే విధంగా ఉండేది.
ఐతే విజయ్ దేవరకొండ మాత్రం దీన్ని ముందే ఊహించి అతను శేఖర్ కమ్ములకు కాదని చెప్పాడు. ఐతే విజయ్ దేవరకొండకు మొదటి సిల్వర్ స్క్రీన్ అఫ్కోర్స్ అది చిన్న పాత్ర అయినా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది శేఖర్ కమ్ముల అని తెలిసిందే. అతను తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి నటించారు. విచిత్రం ఏంటంటే అందులో హీరోలుగా చేసిన వాళ్లు సక్సెస్ అవ్వలేదు కానీ ఆ సినిమాలో చిన్న రోల్స్ చేసిన విజయ్, నవీన్ పొలిశెట్టి సక్సెస్ అయ్యారు.
శేఖర్ కమ్ముల చెప్పాడు కదా అని కథకు ఓకే చేయకుండా తన జడ్జిమెంట్ మీద నిలబడ్డాడు కాబట్టే కుబేర తను కాదన్నాడు. ఐతే ధనుష్ కి మాత్రమే అది పర్ఫెక్ట్ సినిమా అనిపించేలా అతను పర్ఫార్మ్ చేశాడు.
