Begin typing your search above and press return to search.

తగ్గిన కమ్ముల.. తగ్గిన 'కుబేర'!

ఇప్పుడు పూర్తి విభిన్నమైన నేపథ్యంలో కుబేర సినిమాను రూపొందించినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఇతర ప్రమోషనల్‌ వీడియోలతో అర్థం అవుతుంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 2:45 AM
తగ్గిన కమ్ముల.. తగ్గిన కుబేర!
X

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగార్జున ముఖ్య పాత్రలో నటించగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమాలకు పూర్తి విభిన్నంగా, విరుద్దంగా కుబేర సినిమా ఉంటుంది. కమ్ముల చివరి రెండు సినిమాలు ఫిదా, లవ్‌ స్టోరీ సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాల కంటే ముందు ఎక్కువగా ఫీల్ గుడ్‌ ప్రాజెక్ట్‌లను కమ్ముల చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు పూర్తి విభిన్నమైన నేపథ్యంలో కుబేర సినిమాను రూపొందించినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఇతర ప్రమోషనల్‌ వీడియోలతో అర్థం అవుతుంది.

ఈ సినిమాలో ధనుష్‌ను బిచ్చగాడిగా చూపించాడు, నాగార్జున ఈ సినిమాలో ధనవంతుడిగా కనిపించబోతున్నాడు. నాగార్జున, ధనుష్ మధ్య ఉండే సన్నివేశాలు ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే ధనుష్ బిచ్చగాడా లేదంటే ఏదైనా ట్విస్ట్‌ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ప్రత్యేకంగా చిత్రీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి బిజినెస్ అయింది. ముఖ్యంగా నాగార్జున ఈ సినిమాలో నటించడంతో పాటు, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో కుబేర సినిమాను తెలుగు మార్కెట్‌లో హైప్‌ చేసి మరీ ప్రమోట్‌ చేశారు, అందుకు తగ్గట్లుగానే భారీ రిలీజ్‌ కాబోతుంది.

తమిళనాట ధనుష్‌ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో సహజంగానే భారీగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కుబేర సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమా నిడివి మూడు గంటలుగా కన్ఫర్మ్‌ చేశారు. మొన్నటి వరకు దర్శకుడు ఈ సినిమా కథ రీత్యా మూడు గంటల పదిహేను నిమిషాలకు పైగా నిడివితో విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడు. సినిమాను ఎంత ట్రిమ్‌ చేసినా కూడా 3 గంటల 15 నిమిషాల కంటే తగ్గడం లేదని నిర్మాతలతో పట్టుబట్టి మరీ ఆ నిడివితో రిలీజ్ చేయాలని కమ్ముల నిర్ణయించుకున్నాడు. కానీ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞప్తి మేరకు కమ్ముల తగ్గాడు.

శేఖర్ కమ్ముల నిడివి విషయంలో తగ్గాడని, సరిగ్గా మూడు గంటలకు నిడివిని తగ్గించాడని తెలుస్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కుబేర సినిమా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధనుష్ హీరోగా రూపొందిన సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. కనుక ఈ సినిమా సైతం విజయం సాధిస్తుంది అనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కుబేర సినిమా విశేషాలను యూనిట్‌ సభ్యులు పంచుకోవడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రష్మిక మందన్న, నాగార్జున, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు విమానంలో ప్రయాణం చేస్తూ కుబేర సినిమా ప్రమోషన్‌కి హాజరు అయ్యారు. ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ధనుష్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్‌కి హాజరు కాబోతున్నాడు.