Begin typing your search above and press return to search.

కుబేరా.. రిలీజ్ కు ముందే సేఫ్ జోన్ లో..

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా లాస్ట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ కాపీని మేకర్స్ సిద్ధం చేయనున్నారని సమాచారం.

By:  Tupaki Desk   |   24 April 2025 1:30 AM
Kubera Safe Zone Before Release
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇప్పటికే అనౌన్స్ చేసిన జూన్ 20న విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా లాస్ట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ కాపీని మేకర్స్ సిద్ధం చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ చేయనున్నారట. అదే సమయంలో సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హిట్ కచ్చితంగా అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన పోయిరా మామ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. స్టార్టింగ్ లో కాస్త స్లోగా అనిపించినా.. ఇప్పుడు మెల్లగా ఎక్కేస్తోంది. మరిన్ని సాంగ్స్ ను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

అయితే మూవీ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువే అయినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. క్యాస్టింగ్ పారితోషికాలు, షూటింగ్ వ్యయాలు.. అలా వివిధ విషయాల్లో లెక్కలు చేంజ్ అయ్యాయని సమాచారం. మొత్తం కలిపి రూ.100 కోట్లు అయ్యి ఉండొచ్చని వినికిడి. కొద్ది రోజుల క్రితం ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బడ్జెట్ లో 30 శాతం వచ్చేసిందట. హిందీ డబ్బింగ్, డిజిటల్, ఓటీటీ, ఆడియో డీల్స్ నుంచి పెట్టుబడిలో మేకర్స్ 30 శాతం రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఖరారు అవ్వలేదట. అయితే వాటికోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయని వినికిడి. ఏదేమైనా రిలీజ్ కు ముందే మూవీ.. సేఫ్ జోన్ లో ఉందని ప్రచారం జరుగుతోంది. పెట్టుబడి విషయంలో ఎలాంటి డోకా లేదని టాక్.

ఇక మూవీ విషయానికొస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆమె లుక్స్ ను మేకర్స్ రివీల్ చేశారు. జిమ్ సెర్బ్, దలీప్ తహిల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. మరి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న కుబేరా ఎలా ఉంటుందో వేచి చూడాలి.