Begin typing your search above and press return to search.

కుబేర గోల.. ఫ్యాన్స్ కోపాన్ని చిటికెలో తగ్గించేశారు

జూన్ 20న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ధనుష్ – నాగార్జున కాంబో చిత్రం కుబేరా ఓ చిన్న సంఘటనతో సోషల్ మీడియాలో పెద్ద హంగామా రేపింది.

By:  Tupaki Desk   |   24 May 2025 10:13 AM
కుబేర గోల.. ఫ్యాన్స్ కోపాన్ని చిటికెలో తగ్గించేశారు
X

జూన్ 20న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ధనుష్ – నాగార్జున కాంబో చిత్రం కుబేరా ఓ చిన్న సంఘటనతో సోషల్ మీడియాలో పెద్ద హంగామా రేపింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. కానీ మే 25న విడుదలయ్యే టీజర్‌కి సంబంధించిన ప్రకటనలో తలెత్తిన చిన్న అపోహ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఓ పోస్టర్‌తోనే ఈ గందరగోళం మొదలైంది. కుబేరా చిత్ర యూనిట్ మే 23న టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించగా.. ఆ పోస్టర్‌లో నాగార్జున ఒక్కరే కనిపించడం ధనుష్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. వెంటనే సోషల్ మీడియాలో #BoycottKuberaa అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ మొదలైంది. ధనుష్‌ను తప్పించి నాగార్జునను మాత్రమే హైలైట్ చేయడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే కుబేరా టీమ్ అసలైన ఉద్దేశం కొద్దిసేపటికే బయటపడింది. నాగార్జున సినీ రంగ ప్రవేశానికి 39 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన్ను ప్రత్యేకంగా హైలైట్ చేయడమే ఆ పోస్టర్ ఉద్దేశమని వెల్లడైంది. దీని వెంటనే.. 20 నిమిషాల్లోనే ధనుష్ పాత్రను హైలైట్ చేసే మరో టీజర్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చే విధంగా స్పందించారు మేకర్స్.

ఈ వివరణతో ధనుష్ ఫ్యాన్స్ కూడా శాంతించారు. బహుశా మేకర్స్ ముందుగా ప్లాన్ చేసిన విధంగా ఒక్కొక్కరి క్యారెక్టర్ పోస్టర్‌ల ద్వారా టీజర్‌ను ప్రమోట్ చేయాలనుకున్నారని అర్థమవుతోంది. కానీ అభిమానులు ముందుగా దాని వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోకపోవడంతో ఈ అపోహకు దారి తీసింది.

ఇలాంటివి గతంలో కూడా అనేకసార్లు చోటు చేసుకున్నాయి. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాల్లో అభిమానుల మధ్య ఈ తరహా పొరపాట్లు సర్వసాధారణమే. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో నిమిషాల వ్యవధిలోే ట్రెండ్‌లు మారిపోతుంటాయి. అయితే, మేకర్స్ స్పందన త్వరగా వచ్చినందున ఈ వివాదం పెద్దగా కొనసాగకుండా ముగిసింది.

ఇక మే 25న రాబోతున్న కుబేరా టీజర్ పై భారీగా అంచనాలున్నాయి. సినిమా లుక్, కంటెంట్, మ్యూజిక్ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయని టాక్. నాగార్జున పాత్రలో కొత్తదనం ఉంటుందని ఇప్పటికే టీజర్ పోస్టర్ సూచిస్తోంది. ధనుష్ అభిమానులు కూడా వెంటనే మద్దతు ప్రకటించడంతో, ఈ సినిమా ప్రమోషన్‌కు మించిన హైప్ కలిగించిందనే చెప్పాలి. త్వరలో టీజర్ విడుదలవుతుండగా.. సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.