Begin typing your search above and press return to search.

'దేశీ బ్లింగ్' స్టార్ ఏపీతో డేటింగ్ నిజమేనా?

బుల్లితెరపై `ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై` సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన నటి క్రిస్టల్ డిసౌజా తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.

By:  Srikanth Kontham   |   10 Jun 2026 8:00 PM IST
దేశీ బ్లింగ్ స్టార్ ఏపీతో డేటింగ్ నిజమేనా?
X

బుల్లితెరపై `ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై` సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన నటి క్రిస్టల్ డిసౌజా తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అమ్మ‌డి ప్రేమాయణం పై సాగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు క్లారిటీ వ‌చ్చింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త, నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో `దేశీ బ్లింగ్` ఫేమ్ `ఏపీ` తో క్రిస్టల్ ప్రేమలో ఉన్నట్లు విశ్వ‌స‌నీయ‌ వర్గాల ద్వారా ఖరారైంది. ఇద్ద‌రు గత కొన్ని నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు బలమైన కారణం క్రిస్టల్ ఇటీవల తరచుగా దుబాయ్ పర్యటనలు చేయడమే.

కొద్దికాలంగా అమ్మడు దుబాయ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. క్రిస్టల్ ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషకరమైన దశలో ఉన్నారని ఆమె సన్నిహితులు ధృవీక‌రించారు. ప్రస్తుతానికి ఈ జంట తమ బంధాన్ని రహస్యంగా ఉంచడానికే ఇష్ట‌ప‌డుతున్నా? వారి మధ్య ఉన్న బంధం బలంగా ఉందని.. ఒకరితో ఒకరు సమయాన్ని గడపడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారని స‌న్నిహితుల సమాచారం. అయితే అస‌లు ఈ ఊహాగానాలకు బీజం పడింది ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ పార్టీ వీడియోతోనే.

ఓ వేడుకలో ఇద్దరూ స్నేహితులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఆ సమయంలో ఏపీ- క్రిస్టల్ బుగ్గపై సున్నితంగా ముద్దు పెట్టుకోడం నెటిజన్ల కంట పడింది. దీంతో అభిమానులు దీనిని వారి ప్రేమకు సాఫ్ట్ లాంచ్ గా అభివర్ణించారు. ఆ తర్వాత క్రిస్టల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసారు. అందులో అతని ముఖం కనిపించకుండా దాచడంతో ఆ మిస్టరీ మ్యాన్ ఏపీనే అని నెటిజన్లు ఖరారు చేసేశారు. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన `దేశీ బ్లింగ్` షో ద్వారా ఏపీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో ఆయన మోడల్, పేజెంట్ క్వీన్ పమేలా సెరెనా మాజీ ప్రియుడిగా పరిచయమయ్యారు.

బ్రేకప్ తర్వాత కూడా ఇద్ద‌రు మంచి స్నేహితులుగా కొనసాగడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏపీ దుబాయ్‌లో అత్యంత లగ్జరీ కార్ల కలెక్షన్ ..వాటి రెంటల్ బిజినెస్ నడుపుతున్న విజయవంతమైన వ్యాపారవేత్త. క్రిస్టల్ గతంలో ప్రముఖ రెస్టారెంట్ అధినేత గులామ్ గౌస్ దీవానీతో దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని నెలల క్రితం ఇద్ద‌రు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడిపోయినట్లు ప్రచారం సాగింది. బ్రేకప్ వార్తలపై కానీ.. ప్రస్తుత కొత్త బంధంపై కానీ క్రిస్టల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వ్యక్తిగత విషయా లను మీడియా ముందు పంచుకోవడానికి ఇష్టపడని క్రిస్టల్ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.