Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు క్రిష్ 4 ప్రీప్రొడ‌క్షన్ ప‌నులు ప్రారంభం!

తాజా స‌మాచారం మేర‌కు.. క్రిష్ 4 ఆలస్యంగా అయినా కానీ.. త్వ‌రలో ప్రారంభం కాబోతోంద‌ని తెలిసింది. హృతిక్ రోషన్ తన ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో క్రిష్ 4 గురించి ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నాన‌ని తెలిపారు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:07 PM GMT
ఎట్ట‌కేల‌కు క్రిష్ 4 ప్రీప్రొడ‌క్షన్ ప‌నులు ప్రారంభం!
X

హృతిక్ రోష‌న్ న‌టించిన క్రిష్ ఫ్రాంఛైజీ భారీ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో ఇప్ప‌టికే మూడు సినిమాలు విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ సాధించాయి. క్రిష్ 4 ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉన్నా కానీ బ‌డ్జెట్లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఇన్నాళ్లు సాధ్య‌ప‌డ‌లేదు. రెండేళ్లుగా రాకేష్ రోష‌న్ ఈ సినిమాని ప్రారంభిస్తున్నామ‌ని చెబుతున్నా ఇప్ప‌టివ‌ర‌కూ కుద‌ర‌లేదు.

తాజా స‌మాచారం మేర‌కు.. క్రిష్ 4 ఆలస్యంగా అయినా కానీ.. త్వ‌రలో ప్రారంభం కాబోతోంద‌ని తెలిసింది. హృతిక్ రోషన్ తన ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో క్రిష్ 4 గురించి ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నాన‌ని తెలిపారు. రాకేష్ రోషన్ కూడా సినిమా బడ్జెట్, కథ, మేకింగ్ గురించి వెల్ల‌డించి అభిమానులను ఉత్సాహపరిచారు. కరణ్ మల్హోత్రా నాలుగో భాగానికి దర్శకత్వం వహించ‌నున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించార‌ని, ఈ సంవత్సరం చివరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి లీకులు ఇవ్వ‌క‌పోయినా.. 'చేతులు ముడుచుకున్న ఎమోజి'ని షేర్ చేసాడు. క్రిష్ భారతదేశపు మొదటి సూపర్ హీరో ఫ్రాంచైజీగా ప్రచారంలో ఉంది. ఇందులో హృతిక్ రోషన్ టైటిల్ పాత్రలో నటించారు. రీసెంట్‌గా రాకేష్ రోషన్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. క్రిష్ 4 సినిమా చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారో వివరిస్తూ.. మ్యాజికల్ స్క్రిప్ట్‌తో సినిమా ఎలా ఉండబోతుందో కూడా వెల్ల‌డించారు.

మ‌రోవైపు హృతిక్ రోషన్ తదుపరి ప్రాజెక్ట్ 'ఫైటర్' 2025 జ‌న‌వ‌రిలో రిప‌బ్లిక్ డే కానుక‌గా విడుద‌ల‌వుతోంద‌ని తెలుస్తోంది. మోషన్ పోస్టర్ తో విడుదల తేదీని చిత్ర‌బృందం ప్రకటించారు. ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రం. దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.