ఎన్టీఆర్ కెరీర్ ఫినిష్.. ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్..!
అంతేకాదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అతనికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
By: Ramesh Boddu | 10 Oct 2025 2:38 PM ISTసోషల్ మీడియా వచ్చింది కదా ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం వచ్చింది. అలాంటి అవకాశం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడినా.. అలాంటి కామెంట్స్ చేసినా సరే దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. అందులోనూ తమ అభిమాన హీరోని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా సినిమా హీరోలనే వదలరు ఇక మిగతా వాళ్లను ఎలా వదిలేస్తారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినీ క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ వార్ 2 ఫ్లాప్ వల్ల చాలా విషయాల్లో మార్పు వచ్చింది అంటూ లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.
వార్ 2 ఫ్లాప్ వల్ల చాలా మార్పులు..
వార్ 2 ఫ్లాప్ వల్ల చాలా మార్పులు వచ్చాయి.. యష్ రాజ్ ఫిలింస్ క్రిష్ 4లో నిర్మించట్లేదు.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ధూమ్ 4 నుంచి తప్పించారు. హృతిక్ రోషన్ యష్ రాజ్ ఫిలింస్ తో ఫ్యూచర్ లో వర్క్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ నెక్స్ట్ ఫిల్మ్ ఎన్టీఆర్ తో చేయాల్సింది అది క్యాన్సిల్ చేశారు. కియరా అద్వాని కెరీర్ ముగిసినట్టే. ఎన్టీఆర్ కెరీర్ కూడా హిందీ మూవీస్ లో ముగిసినట్టే అని రాసుకొచ్చాడు.
ఐతే కమల్ ఆర్ ఖాన్ కామెంట్స్ కి బాలీవుడ్ స్టార్స్ కాదు అక్కడ ఆడియన్స్ పట్టించుకోవడం కూడా మానేశారు. అలాంటిది సౌత్ ఆడియన్స్ పట్టించుకుంటారా అంటే.. అఫ్కోర్స్ యష్ రాజ్ ఫిలింస్, హృతిక్ రోషన్, కియరా అద్వాని, అయాన్ ముఖర్జీ వీళ్ల గురించి ఏం రాసుకున్నా ఇక్కడ ఎన్ టీ ఆర్ పేరుని మెన్షన్ చేశాడు కదా.. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫైర్ అయ్యేలా చేసింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటాకింగ్..
సినిమా క్రిటిక్ అని చెప్పుకుంటూ కమల్ ఆర్ ఖాన్ ఏం చేస్తున్నాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటాకింగ్ మొదలు పెట్టారు. అంతేకాదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అతనికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరు ఫ్యాన్స్ అయితే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రావు రమేష్ డైలాగ్స్ వాడేస్తూ వాడిని అలా వదిలి పెట్టకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో ఏం జరుగుతుంది అన్నది అసలు జరిగేది కాదు తనకు తానుగా గాసిప్పులు క్రియేట్ చేస్తూ సినిమా వాళ్లను టార్గెట్ చేస్తూ వస్తున్న కమల్ ఆర్ ఖాన్ పోస్ట్ లను బాలీవుడ్ స్టార్స్ ఎప్పుడో లైట్ తీసుకున్నారు. కానీ ఈసారి ఎన్టీఆర్ ని టచ్ చేసి తప్పు పనిచేశాడు కమల్ ఆర్ ఖాన్. ఇప్పుడే కాదు సౌత్ స్టార్స్ విషయంలో ఇదివరకు కూడా కమల్ ఆర్ ఖాన్ విషాన్ని కక్కాడు. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా హిందీలో కెరీర్ ఫినిష్ అయ్యిందన్న కామెంట్స్ కి అంతకంత ఒక రేంజ్ లో అతన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. కమల్ ఆర్ ఖాన్ ఒక పెద్ద జోకర్.. ఎన్టీఆర్ హిందీ కెరీర్ పూర్తవడం అన్నది ఈ దశాబ్దలు అతిపెద్ద జోక్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
