Begin typing your search above and press return to search.

వంద కోట్ల మూవీలో బేబమ్మ..!

ఆ మధ్య తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాను చేజార్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి అదే తమిళనాట ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 8:44 AM GMT
వంద కోట్ల మూవీలో బేబమ్మ..!
X

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ తో కలిసి ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు తెలుగు లో తన మొదటి సినిమా టైటిల్ మాదిరిగానే ఉప్పెనలా దూసుకు వచ్చింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ గా కృతి శెట్టి టాలీవుడ్‌ లో తక్కువ సమయంలోనే నెం.1 గా అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.

కృతి శెట్టి మొదటి మూడు నాలుగు సినిమాలు హిట్ అయినా ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్‌ ఫెయిల్యూర్స్ మూట కట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లే కరువయ్యాయి. వరుస ఫ్లాప్స్ కారణంగా చేతి వరకు వచ్చిన రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు కూడా చేజారి పోయాయి.

ఆ మధ్య తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాను చేజార్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి అదే తమిళనాట ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జయం రవి హీరోగా రూపొందబోతున్న వంద కోట్ల సినిమా 'జీనీ' లో కృతి శెట్టికి ఛాన్స్ దక్కింది.

జీనీ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌ గా కనిపించబోతున్నారు. కళ్యాణి ప్రియదర్శన్‌, వామిక లతో పాటు జయం రవి 'జీనీ' సినిమాలో కృతి శెట్టి కూడా కనిపించబోతుంది. సినిమాలో ఆమె పాత్ర ఏంటి.. ఆమెకు ఈ సినిమా అయినా బూస్ట్ ని ఇచ్చి ఆఫర్లు తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.