Begin typing your search above and press return to search.

కృతి శెట్టి అందుకు ఒప్పేసుకుందా..?

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కృతి శెట్టి రొమాంటిక్ రోల్ చేసిందని తెలుస్తుంది. సినిమాలో అమ్మడు లిప్ లాక్ కూడా ఇచ్చిందని టాక్.

By:  Tupaki Desk   |   29 Feb 2024 10:30 AM GMT
కృతి శెట్టి అందుకు ఒప్పేసుకుందా..?
X

ఉప్పెన భామ కృతి శెట్టి ఫస్ట్ సినిమాతో ఎలాగైతే సూపర్ క్రేజ్ తెచ్చుకుందో అదే ఫాం తో ఒక అరడజను సినిమాల దాకా చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా అమ్మడికి బ్యాడ్ లక్ వెంటాడింది. చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో కృతి శెట్టికి ఆఫర్లు తగ్గాయి. రామ్ తో చేసిన ది వారియర్ ఇచ్చిన షాక్ తో కృతి శెట్టికి మరో ఆఫర్ కూడా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం శర్వానంద్ 35వ సినిమాలో ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఫారిన్ లో జరుపుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో నాలుగేళ్ల బాబు ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. శ్రీరాం ఆదిత్య తనయుడు ఆ పాత్రలో నటిస్తున్నారట. అందుకే ఈ సినిమాకు BoB అని లేదా మనమే అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కృతి శెట్టి రొమాంటిక్ రోల్ చేసిందని తెలుస్తుంది. సినిమాలో అమ్మడు లిప్ లాక్ కూడా ఇచ్చిందని టాక్. అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న టైం లో హీరోయిన్స్ గేరు మార్చక తప్పదు. ఈ క్రమంలో కృతి శెట్టి కూడా ఈమధ్య గ్లామర్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది. అది చాలదు అన్నట్టు ఇప్పుడు సినిమాల్లో గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్ కి రెడీ అంటుందట. అందులో భాగంగా చేతిలో ఉన్న శర్వానంద్ సినిమాలో కూడా కృతి శెట్టి లిప్ లాక్ ఇచ్చిందని టాక్.

హీరోయిన్స్ అంతా కూడా ఎవరికి వారు కొన్ని హద్దులు పెట్టుకుంటారు. వాటిని దాటే రిస్క్ చేయరు. కానీ కొంతమంది మాత్రం అవకాశాలు సన్నగిల్లుతున్నాయ్ అనిపించినప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచుతారు. కృతి శెట్టి కూడా అవకాశాల కోసం ఇన్నాళ్లు పెట్టుకున్న కండీషన్స్ కొన్నిటిని సడలిస్తుందని తెలుస్తుంది. కథల ఎంపిక వల్లనో లేదా అమ్మడి బ్యాడ్ లక్ వల్లో తెలియదు కానీ మొదటి 3 సినిమాలు హిట్ కొట్టిన కృతి శెట్టి ఆ తర్వాత హిట్ సినిమా కోసం యుద్ధం చేస్తుంది. మరి శర్వాతో చేస్తున్న ఈ సినిమా ఆమెను హిట్ ట్రాక్ లో పడేస్తుందా లేదా అన్నది చూడాలి.