Begin typing your search above and press return to search.

బేబమ్మని అమ్మని చేసేశారు..!

ప్రస్తుతం శర్వానంద్ తో మనమే సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. ఈ సినిమాలో కృతి శెట్టి మదర్ రోల్ లో కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   15 March 2024 6:32 AM GMT
బేబమ్మని అమ్మని చేసేశారు..!
X

ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసిన కృతి శెట్టి ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. సినిమాలో ఆమె చేసిన బేబమ్మ పేరుతోనే యూత్ అంతా ఆమె మాయలో పడిపోయారు. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత మొదలయ్యాయి కృతి శెట్టి కష్టాలు. అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుస ఫ్లాపుల వల్ల కృతికి ఆఫర్లు కూడా తగ్గాయి.

తెలుగులో ఎలా అయితే మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుందో వరుస ఫ్లాపుల వల్ల అలానే కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి. కథల విషయంలో సరైన ఎంపిక లేకపోవడం వల్లే బేబమ్మ పరిస్థితి ఇలా అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతం శర్వానంద్ తో మనమే సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. ఈ సినిమాలో కృతి శెట్టి మదర్ రోల్ లో కనిపిస్తుంది.

రీసెంట్ గా రిలీజైన మనమే టీజర్ లో కృతి శెట్టి చిన్న బాబుకి ఫీడింగ్ ఇస్తూ కనిపించింది. సో బేబమ్మ కాస్త అమ్మ అయ్యిందన్నమాట. సినిమా కథలను బట్టి మదర్ రోల్స్ చేయడం తప్పేమి కాదు కానీ అప్పుడే మదర్ రోల్స్ ఏంటి బేబమ్మా అని ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. శర్వానంద్ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో కానీ టీజర్ లో బాబుతో కనిపించడం మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

అయితే తెలుగులో అమ్మడి పరిస్థితి ఇలా ఉంటే తమిళ, మలయాళంలో కృతి క్రేజీ ఆఫర్లు అందుకుంది. కోలీవుడ్ లో జయం రవి హీరోగా చేస్తున్న జినీ సినిమాలో కృతి నటిస్తుంది. మలయాళంలో కూడా టాలెంటెడ్ హీరో టోవినో థామస్ చేస్తున్న సినిమాలో కృతి శెట్టి కథనాయికగా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో కృతి శెట్టి అక్కడ కూడా పాగా వేయాలని చూస్తుంది. అయితే తనకు బేబమ్మగా సూపర్ పాపులారిటీ తెచ్చిన టాలీవుడ్ లో మాత్రం ఇంకా మరిన్ని ఛాన్స్ లు అందుకోవాలని చూస్తుంది కృతి శెట్టి. శర్వానంద్ మనమే హిట్ అయితే ఇక్కడ కూడా కృతికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.