Begin typing your search above and press return to search.

టైగర్ బ్యూటీ.. ఇదే బెస్ట్ ఛాన్స్!

నుపుర్ ప్రస్తుతం తెలుగులో వరస ఆఫర్లు అందుకుంటోంది. నుపుర్ మొదటి సినిమా రవితేజ సరసన టైగర్ నాగేశ్వరర్ రావు లో నటించింది

By:  Tupaki Desk   |   19 Aug 2023 7:53 AM GMT
టైగర్ బ్యూటీ.. ఇదే బెస్ట్ ఛాన్స్!
X

కృతి సనన్ బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లోనూ సత్తా చాటాలని అనుకుంది. ఎన్నో ఆశలతో టాలీవుడ్ కి వచ్చినా, పాపం నిరాశే ఎదురైంది. ఫస్ట్ మూవీ ఛాన్సే మహేష్ తో వచ్చింది. నిజానికి మూవీ హిట్ అయితే, కృతి కెరీర్ కి తిరుగుండేది కాదు. కానీ, అలా జరగలేదు. మహేష్ నేనొక్కడినే సినిమా ప్లాప్ కావడంతో, మళ్లీ కృతి తెలుగులో కనిపించింది లేదు.

అయితే, బాలీవుడ్ లో మాత్రం వరస అవకాశాలు అందుకొని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. మళ్లీ, చాలా కాలం తర్వాత ఆదిపురుష్ మూవీతో తెలుగులో కనిపించింది. కానీ, అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, టాలీవుడ్ సెటిల్ అవ్వాలనే కోరిక కృతి తీర్చుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఆ డ్రీమ్ ని ఆమె చెల్లెలు నుపుర్ సనన్ ఫుల్ ఫిల్ చేసేలా కనపడుతోంది.

నుపుర్ ప్రస్తుతం తెలుగులో వరస ఆఫర్లు అందుకుంటోంది. నుపుర్ మొదటి సినిమా రవితేజ సరసన టైగర్ నాగేశ్వరర్ రావు లో నటించింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల కాకముందే, మరో సినిమాకి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు భక్త కన్నప్ప కథతో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఈ సినిమాలో మీరోయిన్ గా నుపుర్ ని ఎంచుకున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా నుపుర్ కి ఇక టాలీవుడ్ లో తిరుగులేటన్లే. మన టాలీవుడ్ లో ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా హీరోయిన్ల కొరత ఉండనే ఉంది. మంచి హీరోయిన్ దొరికితే మనవాళ్లు వదిలిపెట్టరు. దానికంటూ కొంచెం అదృష్టం ఉంటే చాలు.

మరి, తన అక్క సాధించలేకపోయిన స్టార్ డమ్ ని, టాలీవుడ్ లో నుపుర్ ఎంత వరకు దక్కించుకుంటుందో చూడాలి. నుపుర్ అందంలో తన అక్క కృతి సనన్ కి ఏ మాత్రం తీసిపోదు. మరి యాక్టింగ్ లో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.