Begin typing your search above and press return to search.

నిర్మాత‌గా హీరోయిన్ చాలా కాన్పిడెన్స్ తోనే!

ఇటీవ‌లే తాప్సీ ప‌న్ను నిర్మాత‌గా త‌న అనుభ‌వాన్ని రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Jan 2024 1:30 PM GMT
నిర్మాత‌గా హీరోయిన్ చాలా కాన్పిడెన్స్ తోనే!
X

ఇటీవ‌లే తాప్సీ ప‌న్ను నిర్మాత‌గా త‌న అనుభ‌వాన్ని రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమాలు ఓటీటీలో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కుంటున్నాయి? అవి థియేట‌ర్ వ‌ర‌కూ వెళ్లాలంటే ఎలాంటి స‌వాళ్లు ఎదుర్కువాల్సి ఉంటుంది? వాటిలో లాభ‌న‌ష్టాల గురించి త‌ను స్వీయా అనుభ‌వాలు చెప్పుకొచ్చింది. స్టార్స్ ఉన్న సినిమాల‌కు మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంటుంది? స్టార్స్ లేకున్నా కంటెంట్ ఉన్నా? ఎలాంటి స‌వాళ్లు ఎదుర్కోవాలి అన్న‌ది పూస గుచ్చిన‌ట్లు మ‌రీ వివ‌రించింది.


'ధక్ ధక్' అనే చిత్రాన్ని తాప్సీ స్వ‌యంగా నిర్మించి రిలీజ్ చేయ‌డంతోనే ఈ అనుభ‌వం సాధ్య‌మైంది. తాజాగా 'దో ప‌త్తి' సినిమాతో కృతి స‌న‌న్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. బ్లూ బ‌ట‌ర్ ప్లై అనే సంస్థ‌ని నిర్మించి దోప‌త్తిని నిర్మించింది. ఈ నేప‌థ్యంలో రిలీజ్ కి ముందు త‌న ధీమాని వ్య‌క్తం చేసింది.' థియేటర్లు..ఓటీటీల‌కు కావాల్సింది మంచి కంటెంట్ మాత్ర‌మే. న‌టీన‌టులుగా ఏ సినిమా చేసినా ఆ పాత్ర‌లో ఒదిగిపోతాం.

కానీ దోప‌త్తీ ప్ర‌యాణంలో ముఖ్య పాత్ర పోషిస్తూ స్టోరీ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీ విష‌యం లోనూ భాగ‌మ‌య్యాను. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. సినిమా థియేట‌ర్లో రిలీజ్ అయినా.. ఓటీటీ లో రిలీజ్ అయినా బాగుంటే ఎక్క‌డైనా ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. రెండింటికీ కావాల్సింది కేవ‌లం కంటంట్ మాత్ర‌మే. లార్జ‌ర్ దేన్ లైఫ్ క‌థ‌ల్నే ప్రేక్ష‌కులు ఆస్వాదిస్తున్నారు' అని అంది. దో ప‌త్తీ కాజోల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇది నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక కృతి స‌నన్ హీరోయిన్ గా టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. అమ్మ‌డు కెరీర్ వ‌న్ సినిమాతో ఇక్క‌డే ప్రారంభ‌మైంది. అటుపై రెండు..మూడు సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్క‌డ మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలుగిపోతుంది. జాతీయ ఉత్త‌మ న‌టిగాను గ‌తేడాది ఎంపికైన సంగ‌తి తెలిసిందే.