Begin typing your search above and press return to search.

మూతి మ‌రీ ఇంత ముంద‌కు సాగిపోతే ఎలా?

వెర్రీ వంద‌ర‌కాలు. సోష‌ల్ యుగం అందుబాటులోకి వ‌చ్చాక ఎలాంటి వేషాలు వేసినా చెల్లిపోతుంది

By:  Tupaki Desk   |   30 April 2024 3:30 PM GMT
మూతి మ‌రీ ఇంత ముంద‌కు సాగిపోతే ఎలా?
X

వెర్రీ వంద‌ర‌కాలు. సోష‌ల్ యుగం అందుబాటులోకి వ‌చ్చాక ఎలాంటి వేషాలు వేసినా చెల్లిపోతుంది. ఏం ప‌నిచేసానా? ఎలా ఉన్నా? ఆ స‌న్నివేశాన్ని..దృశ్యాన్ని వెంట‌నే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఎన్ క్యాష్ చేసుకోవ‌డం అన్న‌ది కామ‌న్ గా మారిపోయింది. అందులోనూ సెల‌బ్రిటీల ఉత్సాహానికైతే అస‌లే కొద‌వ‌లేదు. ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయం ఇన్ స్టా వంటి మాధ్య‌మాల ద్వారానే సాధ్య‌మ‌వుతుంది. తాజాగా కృతి స‌న‌న్ లేటెస్ట్ పిక్ ఒక‌టి ఇన్స్టాలో షేర్ చేసింది. అది చూసి నెటి జనులంతా న‌వ్విపోతున్నారు.

ఓ సారి ఆ పిక్ సంగ‌తి చూస్తే ఇదిగో ఇక్క‌డి లా రెస్టారెంట్ లో సింగిల్ గా కూర్చుని ఎంచ‌క్కా ఆట‌లు ఆడుకుంటుంది. రెండు చేతుల‌తో ల‌వ్ సింబ‌ల్ ఫాం చేసి ముఖం చిన్న‌ది చేసి రెండు పెదాలు ద‌గ్గ‌ర‌కుతెచ్చి ఆ మూతిని ఇలా ముందుకు సాగ‌దీసింది. ఎదురుగా ఉన్న వారికిలా ముద్దిచ్చి సిగ్న‌ల్ పాస్ చేసింది. మ‌రి ఎదురుగా ఉన్న ఆ ల‌క్కీ గ‌య్ ఎవ‌రో? పంట పండిన‌ట్లే. ఇందులో కృతి బ్యూటీ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అంతే అందంతో ఆక‌ట్టుకుంటుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు కృతికి ప్ర‌పోజ్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అందులోనూ మూతి ద‌గ్గ‌ర‌కి బిగించిన నేప‌థ్యంలో కుర్రాళ్లు అస్స‌లు ఆగ‌డం లేదు. ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది. ప‌ట్టింద‌ల్లా బంగారమే అవుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు జాతీయ ఉత్త‌మ న‌టిగానూ అవార్డు అందుకుంది.

నిర్మాత‌గానూ స‌త్తా చాటుతోంది. న‌టిగా..నిర్మాత‌గా రెండు ర‌కాల ప్ర‌యాణాన్ని అమ్మ‌డు బ్యాలెన్స్ చేస్తూ ముందు కెళ్తుంది. ఇటీవలే `ది క్రూ`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకుంది. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల‌తో క‌లిసి చేసిన లేడీ ఓరియేంటెడ్ చిత్ర‌మిది. ఈ స‌క్సెస్ చూసి కృతి ఆలోచ‌న విధానం మారింది. కెరీర్ లో మ‌రింత గొప్ప‌గా ఎదిగే దిశ‌గా కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తుంది.