Begin typing your search above and press return to search.

వేగాన్ని అందుకోలేక‌ ఇబ్బంది ప‌డిన హీరోయిన్!

అవేంటో ఆమె మాట‌ల్లోనే.. 'ఏ హీరోతోనైనా మొద‌టిసారి డాన్సు చేయాలంటే భ‌య‌ప‌డ‌తాను. షాహిద్ క‌పూర్ గొప్ప డాన్స‌ర్. ఇండ‌స్ట్రీలో నాకు ఇష్ట‌మైన డాన్సర్ల‌లో అత‌ను ఒక‌రు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 7:30 AM GMT
వేగాన్ని అందుకోలేక‌ ఇబ్బంది ప‌డిన హీరోయిన్!
X

కృతిస‌న‌న్ బాలీవుడ్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ప‌ట్టింద‌ల్లా బంగారమే అవుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు జాతీయ ఉత్త‌మ న‌టిగానూ అవార్డు అందుకుంది. నిర్మాత‌గానూ స‌త్తా చాటుతోంది. న‌టిగా..నిర్మాత‌గా రెండు ర‌కాల ప్ర‌యాణాన్ని అమ్మ‌డు బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది. తాజాగా కృతి స‌న‌న్ 'తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా'లో షాహిద్ క‌పూర్ కి జోడీగా న‌టించింది.


ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డు ఆ సినిమా విశేషాల్ని పంచుకుంది. అవేంటో ఆమె మాట‌ల్లోనే.. 'ఏ హీరోతోనైనా మొద‌టిసారి డాన్సు చేయాలంటే భ‌య‌ప‌డ‌తాను. షాహిద్ క‌పూర్ గొప్ప డాన్స‌ర్. ఇండ‌స్ట్రీలో నాకు ఇష్ట‌మైన డాన్సర్ల‌లో అత‌ను ఒక‌రు. డాన్సులో అత‌డి వేగాన్ని మ్యాచ్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ ఈ సినిమా కోసం ఎలాగూ చేసేసాను. ఈసినిమా షూటింగ్ అంతా ఎంతో స‌ర‌దాగా జ‌రిగింది.

కెరీర్ లోనే నాకు మంచి చిత్రంగా నిలిచిపోతుంద‌ని న‌మ్ముతున్నాను. మంచి క‌థ కావ‌డంతోనే అంత న‌మ్మ‌కంగా ఉన్నాను. ఇందులో షాహిద్ తో నా స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇందులో షాహిద్ శాస్త్ర‌వే త్త‌గా క‌నిపిస్తాడు' అని తెలిపింది. ఈ బ్యూటీ ఎంట్రీ తొలుత టాలీవుడ్ లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న 'వ‌న్ నేనొక్క‌డినే' సినిమాలో న‌టించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని వ్వ‌లేదు.

ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసింది గానీ నిల‌బ‌డ‌లేక‌పోయింది. దీంతో లాభం లేద‌నుకున్న అమ్మ‌డు బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం అక్క‌డ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో 'ఆదిపురుష్' రూపంలో మంచి అవ‌కాశం దొరికినా సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్ర‌య‌త్నంగానే మిగిలిపోయింది.