Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి కృతి స‌నోన్?

దీంతో ఈ స‌న్న‌జాజి బ్యూటీ ఎమ్మెల్యే అవుతుందా? అంటూ అభిమానుల్లో ఉత్సుక‌త మొద‌లైంది.

By:  Tupaki Desk   |   31 March 2024 4:49 AM GMT
రాజ‌కీయాల్లోకి కృతి స‌నోన్?
X

వ‌రుస‌గా ప్ర‌ముఖ క‌థానాయిక‌లు రాజ‌కీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నారు. పార్టీల ప్ర‌క‌ట‌న‌ల అనంత‌రం ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగేస్తున్నారు. ఇందులో కంగ‌న ర‌నౌత్ చాలా స్పీడ్ గా ఉంది. భాజ‌పా త‌ర‌పున మండి (హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్) నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసేందుకు కంగ‌న సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం ప్ర‌చార‌ప‌ర్వంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

కంగ‌న ర‌నౌత్ త‌ర్వాత బీహార్ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తె, చిరుత బ్యూటీ నేహాశ‌ర్మ రాజ‌కీయారంగేట్రం చేయ‌బోతోందంటూ ప్ర‌చార‌మైంది. నేహాశ‌ర్మ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు చాలా ఆస‌క్తిగా ఉంద‌ని త‌న తండ్రి గారు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత బాలీవుడ్ స్టార్ సిస్ట‌ర్స్ క‌రిష్మా క‌పూర్- క‌రీనా క‌పూర్ కూడా రాజ‌కీయాల్లోకి చేర‌తార‌ని క‌థ‌నాలొచ్చాయి. శివ‌సేన అధినాయ‌కుడిని క‌పూర్ సిస్ట‌ర్స్ నేరుగా ఆయ‌న నివాసంలో క‌ల‌వ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అయితే క‌పూర్ గాళ్స్ రాజకీయారంగేట్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఇంత‌లోనే ఇప్పుడు 1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి సనన్ రాజకీయాల్లోకి రానుందంటూ ప్ర‌చారం సాగుతోంది.కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కృతి సనన్ ప్రయాణం బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో కొన‌సాగుతోంది. కొన్ని ఫ్లాపులు ఎదురైనా కానీ ప్ర‌తిభావంత‌మైన‌ న‌టిగా పేరు తెచ్చుకుని కృతి ఎదురే లేకుండా ముందుకు సాగుతోంది. ఇటీవ‌ల మిమీ చిత్రంలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు అందుకుంది. ఆ త‌ర్వాతా కృతికి వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలొస్తున్నాయి. ఇప్ప‌టికి అన్ని అడ్డంకులు అధిగ‌మించి బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఇటీవల కాలంలో కృతి నిర్మాత‌గా మారింది.

కానీ ఎన్నికల సీజన్‌లో కృతి కూడా రాజ‌కీయాల‌పై ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోందంటూ ఒక వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేస్తోంది. దీంతో ఈ స‌న్న‌జాజి బ్యూటీ ఎమ్మెల్యే అవుతుందా? అంటూ అభిమానుల్లో ఉత్సుక‌త మొద‌లైంది. తనకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయా లేదా అనే దానిపై వ్యాఖ్యానించడానికి కృతి వెనుకడుగు వేయలేదు.. ముఖ్యంగా కంగనా రనౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైట్ నిర్ణయించుకున్న నేపథ్యంలో కృతి కూడా ఆస‌క్తిగా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే కృతిస‌నోన్ దీనిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. 1నేనొక్క‌డినే, దోచేయ్, ఆదిపురుష్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్ కి కృతి బాగా సుప‌రిచితం అన్న సంగ‌తి తెలిసిందే.