Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ చేసిన క్రూ గ‌ర్ల్ కృతి

తాజాగా ప్ర‌ఖ్యాత గ్రాజియా క‌వ‌ర్ షూట్ కోసం కృతి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి

By:  Tupaki Desk   |   15 May 2024 5:04 PM GMT
మైండ్ బ్లాక్ చేసిన క్రూ గ‌ర్ల్ కృతి
X

ఇటీవ‌లే క్రూ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఖాతాలో వేసుకుంది కృతి స‌నోన్. ఓవైపు ట‌బు, క‌రీనా లాంటి సీనియ‌ర్ బ్యూటీస్ పోటీప‌డి న‌టిస్తుంటే వారితో పోటీప‌డి మ‌రీ న‌టించింది కృతి. సీనియ‌ర్ ఎయిర్ హోస్టెస్ మ‌ధ్య చిలిపి అల్ల‌రి టీనేజీ హోస్టెస్ గా కృతి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అదంతా అటుంచితే కృతి స‌నోన్ ఇటీవ‌ల ఇంటర్వ్యూల‌లో బోల్డ్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతోంది. అదే స‌మ‌యంలో హాట్ మ్యాగ‌జైన్ ఫోటోషూట్ల‌తోను చెల‌రేగిపోతోంది.

తాజాగా ప్ర‌ఖ్యాత గ్రాజియా క‌వ‌ర్ షూట్ కోసం కృతి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి. కృతి మునుప‌టి కంటే హాట్ గా ఈ ఫోటోషూట్ లో క‌నిపించింది.. కిల్ల‌ర్ లుక్స్ తో క‌ట్టి ప‌డేసింది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక అంద‌మైన పురాత‌న‌మైన ఇంటిని ఎంపిక చేసుకుని ఫోటోగ్రాఫ‌ర్ బిగ్ మ్యాజిక్ చేసాడు. కృతి స‌నోన్ ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్ ల‌లో అద్భుత‌మైన ఫోజుల‌తో చెల‌రేగింది. కృతి స్ట్రైకింగ్ ఫోజులు క‌ట్టి ప‌డేస్తున్నాయి. వీటిలో బ్లూ అండ్ ఆరెంజ్ బ్లింక్ ప‌ట్టీల ఫ్రాకులో కృతి ఇచ్చిన స్పెష‌ల్ ఫోజు కుర్ర‌కారును కిల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

'మిలీ' చిత్రంతో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డ్ అందుకుని అటుపై వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న కృతి స‌నోన్ స్పీడ్ కి ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డే ఛాన్సే లేదు. 2024లో పరిశ్రమలో అత్యంత క్రేజీ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. తేరీ వ‌త‌న్ మే ఐసా ఉల్జా జియా - క్రూ చిత్రాలు కృతికి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్ల‌బ్ లు అందించాయి. ఇదే స‌మ‌యంలో కృతి వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది. అలాగే పరిశ్రమలో వేతన సమానత్వం గురించి కొనసాగుతున్న చర్చలో భాగ‌మైంది. పాపుల‌ర్ పోర్టల్‌తో మాట్లాడుతూ.. వీరే ది వెడ్డింగ్ - క్రూ మధ్య పరిశ్రమలో నాయికా ప్ర‌ధాన క‌థ‌ల విజ‌యం గురించి కృతి ఆనందం వ్య‌క్తం చేసింది.

నాయికా ప్ర‌ధాన చిత్రాలు ఆడుతున్నా కానీ, మేల్ ఆర్టిస్టుల‌తో స‌మానంగా లేడీ ఆర్టిస్టుల‌కు వేత‌నం అంద‌డం లేద‌ని కృతి అభిప్రాయ‌ప‌డింది. అలాగే క‌థానాయిక‌ల‌తో రూపొందించే సినిమాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌తార‌ని వెల్ల‌డించింది. ఈ చిత్రాలకు డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే రిస్క్ తీసుకోవడానికి మేక‌ర్స్ భయపడుతున్నారని అన్నారు.

తన సహనటుల్లో కొందరికి త‌న‌కంటే 10 రెట్లు ఎక్కువ వేతనం ఎందుకు లభిస్తుందనే దాని గురించి చర్చిస్తూ కృతి ఇలా పేర్కొంది.. లేడీ ఓరియెంటెడ్ తో పోలిస్తే, మేల్ సెంట్రిక్ సినిమాల కోసం కేటాయించే బ‌డ్జెట్లు చూస్తే పిచ్చిగా అనిపిస్తుంది. మ‌గ‌, ఆడ న‌టీన‌టుల న‌డుమ వేత‌నం కూడా చాలా తేడా ఉంది. కొన్నిసార్లు మేల్ స్టార్ 10 సంవత్సరాలలో హిట్ ఇచ్చిన దాఖ‌లాలు లేక‌పోయినా అత‌డి పారితోషికం.. క‌థానాయిక‌ల కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నార‌ని కృతి ఆరోపించింది.

తన వృత్తిపరమైన కమిట్‌మెంట్‌ల గురించి మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి తరుణ్ మన్సుఖాని హౌస్‌ఫుల్ 5 లో న‌టిస్తున్నాన‌ని కృతి తెలిపింది. కాజోల్‌తో కలిసి క్రైమ్ థ్రిల్లర్ 'దో పట్టి'లోను కనిపించనుంది. ఈ చిత్రం బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ బ్యానర్ లో కృతి నిర్మిస్తోంది. నిర్మాత‌గా ఇది త‌న‌కు తొలి చిత్రం. అంతేకాకుండా వరుణ్ ధావన్ సరసన భేదియా 2 లోను న‌టించ‌నుంది.