Begin typing your search above and press return to search.

కృతిస‌న‌న్ మ‌దిలో సీతాకోక చిలుక‌లు నాట్యం!

టాలీవుడ్ లో స‌క్సెస్ కాన‌ప్ప‌టికీ హిందీ ప‌రిశ్ర‌మ‌లో బాగానే అవ‌కాశాలు అందుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు నిర్మాత‌గా కూడా ట‌ర్న్ అవుతుంది

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:00 AM GMT
కృతిస‌న‌న్ మ‌దిలో సీతాకోక చిలుక‌లు నాట్యం!
X

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ టాలీవుడ్ కి బాగా సుప‌రిచిత‌మే. 'వ‌న్ నేనొక్క‌డినే'..'దోచెయ్' లాంటి సినిమాల‌తో ప‌రిచ‌య‌మైన బ్యూటీ..ఇటీవ‌లే పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' లో సీత‌మ్మ‌గా మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. సినిమా హిట్ అయితే మంచి పేరొచ్చేది. కానీ ఫ‌లితం మ‌రోలా ట‌ర్న్ చేసింది. ఇక బాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్ లో స‌క్సెస్ కాన‌ప్ప‌టికీ హిందీ ప‌రిశ్ర‌మ‌లో బాగానే అవ‌కాశాలు అందుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు నిర్మాత‌గా కూడా ట‌ర్న్ అవుతుంది. బ్లూ- బ‌ట‌ర్ ప్లై అనే నిర్మాణ సంస్థ‌ని స్థాపించి తొలి ప్ర‌య‌త్నంగా 'దో ప‌త్తి' అనే సినిమా నిర్మిస్తుంది. ఇందులో కాజోల్ అగ‌ర్వాల్ మెయిన్ లీడ్ పోషిస్తున్నారు. కృతి స‌న‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇదొక మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రాబోతుంది.

తాజాగా ఈ సినిమా ప్రారంభ‌మైన సంద‌ర్భంగా కృతి స‌న‌న్ త‌న సంతోషాన్ని పంచుకుంది. ' ఈ ప్ర‌త్యేక‌మైన ప్ర‌యాణాన్ని ప్రారంభించినందుకు ఎన్నో సీతాకోక చిలుక‌లు నా మ‌దిలో నాట్యం చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది. ఇది నాకు స‌వాల్ తో కూడిన పాత్ర‌. నిర్మాత‌గా తొలి అనుభ‌వం. ఇలా కొన్ని లెక్క‌లు నాకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఈ సినిమా క‌థ నాకెంతో న‌చ్చింది. అందుకే నిర్మాత‌గా మారుతున్నాను. ఇక‌పై త‌రుచూ సంస్థ‌లో సినిమాలు నిర్మిస్తాను. మంచి కంటెట్ ఉన్న క‌థ‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తాను' అని అన్నారు.

ఇక కృతి సినిమాల సంగ‌తి చూస్తే న‌టిగా బిజీగా ఉంది. 'గ‌ణ‌ప‌త్ పార్ట్-1'..'ది క్రూ' స‌హా మ‌రో టైటిల్ నిర్ణ‌యించిన సినిమా షూటింగ్ లు ఇప్ప‌టికే పూర్తిచేసింది. ప్ర‌స్తుతం ఆ సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శలో ఉన్నాయి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు కొన్ని లైన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.