Begin typing your search above and press return to search.

కృతి సనన్ కిల్లర్ లుక్

ఫీమేల్ ఒరియాంటెడ్ కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   28 Sept 2024 5:07 PM IST
కృతి సనన్ కిల్లర్ లుక్
X

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ కృతి సనన్. ఈ అమ్మడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. కృతి సనన్ నటించిన ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా’, ‘క్రూ’ సినిమాలు ఈ ఏడాది థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో ‘క్రూ’ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఫీమేల్ ఒరియాంటెడ్ కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది.


ఇదిలా ఉంటే ‘దో పత్తి’ అనే సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకి కృతి సనన్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ‘1:నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘హీరోపంతి’ మూవీతో అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.


కృతి సనన్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల్లో లైక్స్ వస్తాయి. రెగ్యులర్ గా డిఫరెంట్ అవుట్ ఫిట్ లతో కృతి సనన్ తన ఫాలోవర్స్ కి కలర్ ఫుల్ గా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. నెటిజన్లు కూడా కృతి సనన్ గ్లామర్ ఫోటోలని వీక్షిస్తూ ఉంటారు. వాటిపై తమదైన శైలిలో కామెంట్స్ పెడుతూ కృతి సనన్ అందంపై ప్రశంసలు కురిపిస్తారు.


తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో అదిరిపోయే స్టన్నింగ్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటోలని ఏకంగా 4.43 లక్షల మంది ఇప్పటి వరకు లైక్ చేశారు. జలకన్య తరహాలో శరీరం మొత్తం కప్పేసిన ఈ అవుట్ ఫిట్ కృతి సనన్ అందానికి మరింత వన్నెలు అందిస్తోంది. ఒక్క నిమిషంలో జలకన్య అంటూ ఈ ఫోటోలకి కృతి సనన్ కామెంట్ మెన్షన్ చేసింది. ఫ్యాన్స్ నుంచి కృతి సనన్ అందానికి వావ్ అనే కామెంట్స్ వస్తున్నాయి.