Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెడ్‌ డ్రెస్ లో అందాల ఆ'కృతి'

సుకుమార్ రూపొందించిన ఆ సినిమా కమర్షియల్‌ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో టాలీవుడ్‌ లో ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ రాలేదు.

By:  Tupaki Desk   |   8 May 2024 6:17 AM GMT
పిక్ టాక్ : రెడ్‌ డ్రెస్ లో అందాల ఆకృతి
X

పలు కమర్షియల్‌ యాడ్స్ లో నటించి గుర్తింపు దక్కించుకున్న కృతి సనన్ కు తెలుగు లో మహేష్ బాబుకు జోడీగా 1- నేనొక్కడినే సినిమాలో హీరోయిన్‌ గా నటించే ఛాన్స్ దక్కింది. సుకుమార్ రూపొందించిన ఆ సినిమా కమర్షియల్‌ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో టాలీవుడ్‌ లో ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ రాలేదు.


సౌత్‌ లో దక్కని ఆఫర్లు బాలీవుడ్‌ లో ఈ అమ్మడి తలుపు తట్టాయి. హిందీలో ఈ అమ్మడు స్టార్‌ హీరోలందరితో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ అమ్మడు నటించిన పలు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. 2021 లో మిమీ సినిమాకు గాను ఈ అమ్మడు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్ ష్రాఫ్‌ మొదటి సినిమా హీరోపంతి లో హీరోయిన్‌ గా కృతి నటించి మెప్పించింది. ఈ సినిమాలో కృతి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు ఆ తర్వాత ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇటీవల ప్రభాస్ కు జోడీగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది.

ఇక ఈమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో కంటిన్యూగా సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్‌ చేసిన ఈ రెడ్‌ డ్రెస్ అందాల ఫోటో షూట్‌ కి నెటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పిక్స్ కి లక్షల్లో లైక్స్ వచ్చాయి.

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలను చూస్తూ ఉంటే ముందు ముందు బాలీవుడ్‌ లో ఈ అమ్మడు మరిన్ని స్టార్‌ హీరోల సినిమాలను చేయడం కన్ఫర్మ్‌ గా తెలుస్తోంది. మరో పదేళ్ల పాటు కృతి సనన్ కి బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా క్రేజ్ కొనసాగవచ్చు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 2 సినిమాలో కృతి సనన్‌ ను ఐటం సాంగ్‌ కోసం సంప్రదించారు అనే వార్తలు వచ్చాయి. అదే కనుక నిజం అయితే కచ్చితంగా పాన్‌ ఇండియా రేంజ్ లో పుష్ప 2 కి అది మంచి అదనపు బలం అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల అంటున్నారు. మరి ఆ వార్త ఎంత వరకు నిజం అనేది చూడాలి.