Begin typing your search above and press return to search.

నెక్ట్స్‌ లెవల్‌ కి 'తీన్మార్‌' బ్యూటీ ఆరేళ్ల ప్రేమ..!

కృతి కూడా సన్నిహితులు మరియు స్నేహితుల సమక్షంలో వైభవంగా పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. సోషల్‌ మీడియాలో కృతి కర్భందకు కాబోయే వాడి గురించిన చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   6 March 2024 12:49 PM GMT
నెక్ట్స్‌ లెవల్‌ కి తీన్మార్‌ బ్యూటీ ఆరేళ్ల ప్రేమ..!
X

తెలుగు ప్రేక్షకులకు బోణి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి స్టార్‌ డమ్‌ దక్కలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవ్వబోతున్నా కూడా ఇంకా సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తూనే ఉంటుంది.

మొన్నటి వరకు కూడా సినిమాల్లో అడపా దడపా నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఆరు సంవత్సరాలుగా ఈ అమ్మడు పుల్కిత్‌ సామ్రాట్‌ తో ప్రేమలో ఉంది. ఇటీవల తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించి.. పుల్కిత్‌ ఫోటోను షేర్‌ చేసింది.

గత నెలలో పెళ్లి విషయాన్ని ప్రకటించిన కృతి కర్భందా అన్నట్లుగానే ఈ నెలలో పెళ్లికి రెడీ అవుతోంది. తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పెళ్లి తేదీని కన్ఫర్మ్‌ చేసింది. మార్చి 13న వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నట్లు పేర్కొంది. పెళ్లి కార్డును షేర్‌ చేసిన కృతి ఎక్కడ వివాహ వేదిక అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇటీవల హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్ గోవాలో తన బాయ్‌ ఫ్రెండ్‌ గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. కృతి కూడా సన్నిహితులు మరియు స్నేహితుల సమక్షంలో వైభవంగా పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. సోషల్‌ మీడియాలో కృతి కర్భందకు కాబోయే వాడి గురించిన చర్చ జరుగుతోంది.

పవన్‌ కళ్యాణ్ తో తీన్మార్‌ సినిమాలో సెకండ్‌ హీరోయిన్ గా నటించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్భందా ఆ తర్వాత రామ్‌ చరణ్‌ కి సోదరి పాత్రలో బ్రూస్లీ సినిమాలో నటించింది. పెళ్లి తర్వాత ఈమె సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతుందేమో చూడాలి.