Begin typing your search above and press return to search.

త‌న‌కంటే 10ఏళ్లు చిన్న‌వాడితో కృతి డేటింగ్?

కృతి తన వృత్తిపరమైన జీవితంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విష‌యాల‌లో ముఖ్యాంశాలలో ఉంది.

By:  Tupaki Desk   |   24 March 2024 1:10 PM GMT
త‌న‌కంటే 10ఏళ్లు చిన్న‌వాడితో కృతి డేటింగ్?
X

బాలీవుడ్ అందాల‌ నటి కృతి సనన్ ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ `ఆదిపురుష్` చిత్రంలో న‌టించింది. ఆ తర్వాత మిలీ చిత్రంలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవ‌ల‌ విడుద‌లైన‌ `తేరీ వ‌త‌న్ మే ఐసా ఉల్జా జియా`లో కనిపించింది. ఈ రోబోటిక్ డ్రామా చిత్రంలో కృతితో పాటు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో త‌న‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కృతి తన వృత్తిపరమైన జీవితంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విష‌యాల‌లో ముఖ్యాంశాలలో ఉంది.

కృతి తన ఎఫైర్ వార్తలతో చాలాసార్లు హెడ్‌లైన్స్‌లో నిలిచింది. బాహుబలి ఫేమ్ ప్రభాస్‌తో కృతి ప్రేమ‌లో ప‌డిందంటూ ప్ర‌చారం సాగింది. ఇప్పుడు కృతి వేరొక‌రితో డేటింగ్ లో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఈ కొత్త ప్రేమాయ‌ణం గురించి బి-టౌన్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఏకైక ప్ర‌శ్న ఏమిటి? అంటే! కృతి బాయ్‌ఫ్రెండ్ ఎవరు?

అయితే ఈ సందేహానికి కార‌ణం .. మిస్టరీ మ్యాన్‌తో కృతి ఫోటో అంత‌ర్జాలంలో వైరల్ అవ్వ‌డ‌మే. కృతి సనన్ స‌ద‌రు మిస్ట‌రీ మేన్ తో షికార్ చేస్తున్న‌ప్ప‌టి ఫోటో ఒక‌టి రెడ్డిట్‌లో షేర్ అయింది. ఈ ఫోటో బయటకు వచ్చిన వెంటనే వారి ఎఫైర్ గురించి మళ్లీ సోషల్ మీడియాలో వార్తలు రావడం ప్రారంభ‌మైంది.

వాస్తవానికి ఈ ఫోటోలో కృతి లండన్ వీధుల్లో ఒక అబ్బాయి చేయి పట్టుకుని తిరుగుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోని చూసి ఈ కుర్రాడు మరెవరో కాదు త‌న బాయ్‌ఫ్రెండ్! అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ అబ్బాయి పేరు కబీర్ బహియా అంటూ బాలీవుడ్ మీడియాలో ఒక ప్ర‌చారం సాగుతోంది. కబీర్ బ్రిటన్ నివాసి. కబీర్ కృతి కంటే దాదాపు పదేళ్లు చిన్నవాడని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు... కబీర్ తండ్రి ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. కృతి సనన్‌తో తన ఎఫైర్ వార్తల కారణంగా వార్తల్లోకి వచ్చిన కబీర్ బహియాకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కూడా సంబంధం ఉన్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మహేంద్ర సింగ్ ధోని అతడి భార్య సాక్షి ధోనితో కొన్ని ఫోటోల‌లో క‌బీర్ కనిపించాడు. కబీర్ సాక్షికి బంధువు అని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కృతి సనన్ - కబీర్ బహియా వారి సంబంధానికి సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. దీనికి ముందు కృతి పేరును సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో లింక‌ప్ చేసి క‌థ‌నాలు వెలువ‌రించారు. కానీ దానిని ఆ ఇద్దరూ ఖండించారు. ఆదిపురుష సెట్స్ నుండి ప్రభాస్ - కృతిల ఎఫైర్ గురించి వార్తలు వెలువడ్డాయి.