క్రికెట్ స్టేడియంలో రహస్య ప్రియుడితో హీరోయిన్..!
మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్.
By: Tupaki Desk | 15 July 2025 10:50 AM ISTమహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్. మొదటి సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడికి లక్కీగా బాలీవుడ్‌లో 'హీరో పంతీ' సినిమాలో ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ మూవీ హీరో పంతీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిందీలో వరుసగా సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్‌లో మలి ప్రయత్నంగా నాగ చైతన్యతో కలిసి 'దోచెయ్' సినిమాతో వచ్చింది. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా నిరాశను మిగిల్చాయి. దాంతో టాలీవుడ్‌కి పూర్తిగా దూరం అయింది. అయితే ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి.
ప్రభాస్‌తో కలిసి 2023లో 'ఆదిపురుష్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది మూడు హిందీ సినిమాలతో వచ్చిన కృతి సనన్ గత కొన్నాళ్లుగా వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు సందర్భాల్లో వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా కృతి సనన్ పెళ్లికి దూరంగా ఉంటుంది. అయితే సమయం చిక్కినప్పుడల్లా ప్రియుడు కబీర్ బహియాతో కలిసి హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తుంది. తాజాగా లండన్‌లోని లార్డ్స్ మైదానంలో వీరిద్దరూ కనిపించారు. ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌ను కలిసి చూశారు.
ఈ ఏడాది ఆరంభంలో బెంగళూరులో జరిగిన ఒక స్నేహితుడి పెళ్లిలో వీరిద్దరు కలిసినట్లు సమాచారం. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారట. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవడం కోసం వీరు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారట. బాలీవుడ్‌లో హీరోయిన్స్ చాలా మంది పెళ్లి చేసుకుని తమ కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు. కనుక ఈ కృతి సనన్ సైతం ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో కబీర్ బహియాను వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను యధావిధిగా సాగించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే ఇండియాకు రానున్నారు. లండన్‌లో వీరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎక్కడకు వెళ్లినా జనాలు వీరిని గుర్తు పట్టి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా క్రికెట్ స్టేడియంలో కూడా వీరిని గుర్తించిన కొందరు ఫోటోలు తీసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. కబీర్ సైతం కృతి తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి రిలేషన్ అఫిషియల్ అయ్యింది. కబీర్ బహియాకి లండన్‌లో వ్యాపారాలు ఉన్నాయి. దాంతో ఎక్కువ శాతం ఆయన అక్కడే ఉంటాడని తెలుస్తోంది. కృతి సనన్ సైతం షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా లండన్‌లోనే ఉంటుంది.
