Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : టైట్‌ డ్రెస్‌లో అందాల కృతి

మహేష్‌ బాబుకి జోడీగా '1 : నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌.

By:  Tupaki Desk   |   11 April 2025 9:00 AM IST
పిక్‌టాక్‌ : టైట్‌ డ్రెస్‌లో అందాల కృతి
X

మహేష్‌ బాబుకి జోడీగా '1 : నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. మొదటి సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది. లక్కీగా ఈ అమ్మడికి హిందీలో 'హీరోపంతి' సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా బిజీ అయింది. తెలుగులో దోచెయ్‌ సినిమాలో నటించిన ఈమెకు మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నిరాశే మిగిలింది. దోచెయ్‌ సినిమా తర్వాత టాలీవుడ్‌కి దూరం అయింది. ప్రభాస్‌కి జోడీగా ఆదిపురుష్‌ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

2019లో ఏకంగా అర డజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి సనన్‌ ఆ తర్వాత కూడా ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చింది. గత ఏడాది ఈమె నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాదిలో రెండు లేదా మూడు సినిమాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె తేరే ఇష్క్‌ మే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఈమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కృతి సనన్‌కి దాదాపుగా ఆరు కోట్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. తక్కువ సమయంలోనే ఈమెకు ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ దక్కారు. సోషల్‌ మీడియాలో అత్యధిక సంపాదన కలిగి ఉన్న హీరోయిన్స్‌లో ఈమె ఒకరు అనడంలో సందేహం లేదు. అందుకు తగ్గట్లుగానే ఈమె రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు, పొడుగు కాళ్ళ సుందరిగానూ పేరు దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్‌లో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌ జాబితాలోనూ ఈమె ముందు ఉన్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె టైట్ డ్రెస్‌లో అందంగా కనిపించి అలరించింది. స్కిన్‌ టైట్ డ్రెస్లో కొందరు ముద్దుగుమ్మలు ఎబ్బెట్టుగా ఉంటారు. కానీ ఈమె మాత్రం చాలా అందంగా ఉందనే కామెంట్స్ దక్కించుకుంది.

ఈమె నటించిన మిమి సినిమాకు గాను జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సరోగేట్‌ తల్లి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. జాతీయ అవార్డుతో పాటు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించడం ద్వారా మంచి పేరు సొంతం చేసుకుంది. అదే సమయంలో ఆమె మేకోవర్‌, స్కిన్‌ షో విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తున్న ఈమె సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు రెడీగా ఉంది. యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె భవిష్యత్తులో నటించే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.