Begin typing your search above and press return to search.

విదేశాలలో రైడ్ చేస్తూ సెగలు పుట్టిస్తున్న కృతి సనన్!

ఏది ఏమైనా కృతి సనన్ రెండు వైపులా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ మరింత సంతోషంగా కనిపిస్తోందని ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   20 May 2026 9:00 PM IST
విదేశాలలో రైడ్ చేస్తూ సెగలు పుట్టిస్తున్న కృతి సనన్!
X

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతూనే మరొకవైపు అక్కడి అందాలను తిలకిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది . అందులో భాగంగానే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం కాక్ టెయిల్ 2..2012లో వచ్చిన కాక్ టెయిల్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో హీరోయిన్గా నటిస్తోంది. హోమీ అడజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లోని సిసిలీ ప్రాంతంలో జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రదేశాలను ఆస్వాదిస్తూ.. జీప్ లో ఎండలో సేద తీరుతున్నట్లు అక్కడి ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా మల్టీకలర్ బికినీతో పాటు ఐవరీ ఫ్రిండ్జ్ షార్ట్స్ ధరించిన ఈమె .. తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు కాస్త సమయం దొరికితే చాలు అక్కడ ఇటలీ వీధుల్లో కూడా విహరిస్తూ ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఏది ఏమైనా కృతి సనన్ రెండు వైపులా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ మరింత సంతోషంగా కనిపిస్తోందని ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

1990 జూలై 27న ఢిల్లీలో జన్మించిన ఈమె.. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది . ముఖ్యంగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించి బాలీవుడ్లో భారీ పాపులారిటీ అందుకున్న కృతి.. తొలిసారి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో అరంగేట్రం చేసింది. హిందీలో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ సరసన హీరో పంతి సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ హిందీ చిత్రంలో సీతగా నటించింది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇకపోతే 2021 లో వచ్చిన మిమీ అనే సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు , జాతీయ చలన చిత్ర అవార్డు అందుకున్న ఈమె.. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో పేరు దక్కించుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కృతి సనన్ గత ఏడాది ధనుష్ హీరోగా నటించిన తేరే ఇష్క్ మే అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అమర కావ్యం పేరిట రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం కాక్ టెయిల్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అలాగే అభిమానులను అలరించడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను పంచుకుంటున్న విషయం తెలిసిందే.