Begin typing your search above and press return to search.

ఆవుల్ని పూజిస్తాం..వాటికి హార‌తులిస్తాం! కృతిశెట్టి

ఈరోజు పశువుల్ని ప్ర‌త్యేకంగా అలంక‌రించి హారతులిస్తాం. పండ్లు.. కూర‌గా య‌లు..స్వీట్లు తినిపిస్తారు. సాయంత్రం అయిందంటే విద్యుత్ దీపాల‌తో మంగుళూరు క‌ళ‌క‌ళ‌లాడుతుంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 1:15 PM GMT
ఆవుల్ని పూజిస్తాం..వాటికి హార‌తులిస్తాం! కృతిశెట్టి
X

వాయు వేగంతో టాలీవుడ్ కి దూసుకొచ్చిన కృతిశెట్టి అంతే వేగంగా చ‌ల్ల‌బ‌డింది. ఆరంభంలో చూపించిన ఉత్సాహం ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. దీంతో అమ్మ‌డు ఇత‌ర భాష‌ల్లోకి వెళ్లింది. కోలీవుడ్.. మాలీవుడ్ లో నూ అదృష్టాన్ని ప‌రీక్షించు కుంటుంది. ప్ర‌స్తుతం అక్క‌డ కొన్ని సినిమాలు చేస్తోంది.అలాగే తెలుగులో శ‌ర్వా 35 అనే ఓ సినిమా చేతిలో ఉంది. ఆశ‌ల‌న్నీ వీటిపైనే..స‌క్స‌స్ అందుకుని మునుప‌టి క్రేజ్ ని అందుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంది.

మ‌రి అమ్మ‌డు టైమ్ ఎలా ఉందో? చూడాలి. ఇక దివాలీని ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటారంటే? ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెప్పుకొచ్చింది. 'మంగుళూరు దద్ద‌రిల్లేలా దీపావ‌ళి చేసుకుంటాను. దీన్ని మేము రైతుల పండ‌గ‌లా భావిస్తాం. ఈరోజు పశువుల్ని ప్ర‌త్యేకంగా అలంక‌రించి హారతులిస్తాం. పండ్లు.. కూర‌గా య‌లు..స్వీట్లు తినిపిస్తారు. సాయంత్రం అయిందంటే విద్యుత్ దీపాల‌తో మంగుళూరు క‌ళ‌క‌ళ‌లాడుతుంది.

మాప్రాంతం ..ప‌ర్యాట‌కులు కూడా ఈ స‌మ‌యంలోనే ఎక్కువ గా వ‌స్తుంటారు. చుట్టూ ప‌క్క‌ల వారు సైతం మంగుళూరుకొచ్చి సెల‌బ్రేట్ చేసుకుంటారు. అందుకే ఏ దీపావ‌ళిని మిస్ అవ్వ‌ను. త‌ప్ప‌కుండా ఇంట్లో అమ్మ‌నాన్న‌ల‌తో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం అల‌వాటు. ఎంత బిజీగా ఉన్నా దీపావ‌ళికి మాత్రం ఇంటికె ళ్లిపోతాను. అస‌లే నాకు చీర‌...ప‌రికిణి అంటే పిచ్చి. పండ‌గ‌రోజు వాటిని మాత్ర‌మే ధ‌రిస్తాను.

న‌టిని అయిన త‌ర్వాత ర‌క‌ర‌కాల దుస్తులు వేసుకుంటున్నాను. కానీ అవి సినిమాల వ‌ర‌కూ ప‌రిమితం. ఇంట్లో మాత్రం సాధార‌ణ దుస్తుల్లోనే ఎక్కువ‌గా ఉంటా. పండ‌గొస్తే నా అంత అందంగా మ‌రొక‌రు ముస్తా బ‌వ్వ‌రు అనిపించేలా అలంక‌రించుకుంటా' అని అంది.