Begin typing your search above and press return to search.

సగానికి తగ్గించినా అమ్మడిని పట్టించుకోవట్లేదా..?

టాలీవుడ్ లో లక్కు కలిసి వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేని హీరోయిన్ ఎవరంటే అది బెంగుళూరు భామ కృతి శెట్టినే అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   13 April 2024 6:53 AM GMT
సగానికి తగ్గించినా అమ్మడిని పట్టించుకోవట్లేదా..?
X

టాలీవుడ్ లో లక్కు కలిసి వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేని హీరోయిన్ ఎవరంటే అది బెంగుళూరు భామ కృతి శెట్టినే అని చెప్పాలి. తొలి సినిమా ఉప్పెనతోనే 100 కోట్లు దక్కించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత చేయడానికి ఏడు ఎనిమిది సినిమాలు చేసినా వాటిలో రెండంటే రెండే సినిమాలు సక్సెస్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ కూడా కృతి సినిమాల లెక్క కోసమే తప్ప ఆమె కెరీర్ కు ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. ఉప్పెన క్రేజ్ తో వచ్చిన ఆఫర్లన్నీ చకచకా చేస్తూ వచ్చిన బేబమ్మ ఇప్పుడు చేతిలో అవకాశాలు లేక ఖాళీ అయ్యింది.

ఏడాది గ్యాప్ తర్వాత శర్వానంద్ తో మనమే సినిమా ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి. అయితే తెలుగులో ఛాన్సులు లేకపోయినా మలయాళంలో టోవినో థామస్ తో ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ లో కూడా జయం రవి హీరోగా వస్తున్న జినీ సినిమాలో కృతి నటిస్తుంది. ఆ రెండు సినిమాలు హిట్ పడితే కృతి శెట్టికి అక్కడ క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన టాలీవుడ్ లో మాత్రం కృతికి పెద్దగా అవకాశాలు రావట్లేదు.

కృతి శెట్టి మాత్రం టాలీవుడ్ లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. ఇక్కడ సినిమా అంటే రెమ్యునరేషన్ సగం తగ్గించడానికి కూడా రెడీ అనేస్తుంది అమ్మడు అని కూడా టాక్ ఉంది . మొదటి సినిమాకు 50 లక్షల లోపే రెమ్యునరేషన్ అందుకున్న కృతి ఉప్పెన హిట్ తర్వాత కోటి దాకా అందుకుంది. వరుస సినిమాలతో ఆమెకు కూడా కోటిన్నర రెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ గురించి కాదు ముందు ఒక్క మంచి ఛాన్స్ ఇస్తే చాలు అనేస్తుందట అమ్మడు.

ఈమధ్య తన ఫోటో షూట్స్ చూస్తుంటే ఇన్నాళ్లు తను కాదని చెప్పిన గ్లామర్ సైడ్ కూడా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది. మనమే సినిమా సక్సెస్ అయితే కృతి టాలీవుడ్ కెరీర్ గాడిన పడే అవకాశం ఉంది. శర్వానంద్ చేతుల్లోనే బేబమ్మ భవిష్యత్తు ఉంది. కృతి మాత్రం ఇతర భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆ ఛాన్స్ ఎవరిస్తారు.. ఏ సినిమాతో అమ్మడు క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.