Begin typing your search above and press return to search.

య‌వ్వ‌నం ఒక ఉప్పెన‌

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో వ‌ర‌స ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న కృతి ఇప్పుడు బ్లాక్ లో మ‌తులు చెడ‌గొట్టే ఫోటోషూట్ ని షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:29 AM GMT
య‌వ్వ‌నం ఒక ఉప్పెన‌
X

అవును.. య‌వ్వ‌నం ఒక ఉప్పెన‌... అది ఎగ‌సెగ‌సి ప‌డుతుంటే.. ఎలా ఉంటుందో ఇదిగో ఇక్క‌డ ఉప్పెన బ్యూటీని చూస్తే అర్థ‌మ‌వుతుంది. కృతి శెట్టి స్పెష‌ల్ లుక్ ఇప్పుడు కుర్ర‌కారు వాట్సాపుల్లో ట్రెండింగ్ గా మారింది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో వ‌ర‌స ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న కృతి ఇప్పుడు బ్లాక్ లో మ‌తులు చెడ‌గొట్టే ఫోటోషూట్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇది అంత‌ర్జాలంలో కాక‌లు రేపుతోంది.


జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా అవ‌కావాలు అందుకుంటున్న ఈ బ్యూటీని రామ్ వారియ‌ర్ ప‌రాజ‌యం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. లింగుస్వామి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌కో బిగ్ బ్రేక్ ఇస్తాడ‌నుకుంటే అది కాస్తా ఫ్లాపైంది. ఆ త‌ర్వాతా నితిన్ తో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అదే ఫ‌లితంతో నిరాశ‌ప‌రిచింది. ఈ అమ్మాయి గురించ మీకు చెప్పాలి ఫ్లాప్. మ‌ల‌యాళంలో అజ‌యంటే రాండ‌మ్ మోష‌న‌మ్ అనే చిత్రంలో న‌టిస్తోంది. జీనీ అనే మ‌రో చిత్రంలోను న‌టిస్తూ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఇవి రెండూ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.

ఇంత‌లోనే కృతి త‌మిళంలో కార్తీ స‌ర‌స‌న క్రేజీ అవ‌కాశాన్ని అందుకుంది. కార్తీ తదుపరి దర్శకుడు నలన్ కుమారసామితో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇది గత ఏప్రిల్‌లో ప్రారంభమైంది. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రానికి కృతి గ్లామ‌ర్ అస్సెట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50శాతం పూర్తయింది. ఈ చిత్రంలో కార్తీ MGR అభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజా విలన్‌గా నటిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా కృతి శెట్టి కార్తీతో జతకట్టడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే హీరోలో సగం కంటే తక్కువ వయస్సు గల కృతి ఎంపిక ఈ ఆశ్చ‌ర్యానికి కార‌ణం. ఇది ఎలా వ‌ర్క‌వుట‌వుతుందో చూడాలంటూ తంబీల్లో చ‌ర్చ సాగుతోంది.