Begin typing your search above and press return to search.

ఒళ్లంతా ముత్యాలతో బేబమ్మ!

తెలుగులో ఫస్ట్ మూవీ ఉప్పెనతో బేబమ్మగా అందరి మనసుల్లో నిలిచిపోయింది కృతి శెట్టి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 10:08 AM GMT
ఒళ్లంతా ముత్యాలతో బేబమ్మ!
X

తెలుగులో ఫస్ట్ మూవీ ఉప్పెనతో బేబమ్మగా అందరి మనసుల్లో నిలిచిపోయింది కృతి శెట్టి. హీరోయిన్ గా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలా డెబ్యూ మూవీతో హిట్ కొట్టడం చాలా తక్కువమందికి జరుగుతుంటుంది. అంతే కాదు.. తన ఫస్ట్ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించి మరో విజయాన్ని అందుకుంది కృతి.


యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో యాక్ట్ చేసి హ్యాట్రిక్ సాధించింది. ఆ మూవీలో తన క్యూట్ లుక్స్ తో అందరినీ మెప్పించింది. ఆ తర్వాత బ్యూటీ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వరుసగా ఫ్లాపులతో సతమతవుతున్న ఈ బ్యూటీ.. కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రీసెంట్ గా తెలుగులో మనమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


జూన్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమాలో సుభద్రగా బ్యూటిఫుల్ గా కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీతో పాటు మరికొన్ని చిత్రాల్లో కృతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది కృతి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ పోస్ట్ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోవర్లను పెంచుకుంటోంది అమ్మడు.


తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగుడుతుంటోంది కృతి శెట్టి. సన్నని నడుముతో మాయ చేస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. అందాల అరాచకమంటే ఏంటో చూపిస్తుంటోంది. స్కిన్ షోతో అలరిస్తుంటోంది. గ్లామర్ షో అంటే ఇలా ఉండాలంటూ రుచి చూపిస్తుంటోంది. తన ఫోజులతో నెట్టింట సెగలు పుట్టిస్తుంటోంది. ఎప్పుటికప్పుడు తన పిక్స్ తో నెట్టింట ట్రెండింగ్ అవుతూనే ఉంటోంది.


తాజాగా దివి నుంచి భువికి వచ్చిన ఏంజెల్ లా కనిపించి క్లీన్ బౌల్డ్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ పై ముత్యాలతో అదరగొట్టేసింది. సింపుల్ హెయిర్ స్టైల్ తో వేరే లెవల్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బేబమ్మ దేవకన్యలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అందానికి ఇమేజ్ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తూ కామెంట్ల బాక్స్ నింపేస్తున్నారు.