Begin typing your search above and press return to search.

LIC లో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ

చిన్న వయసులోనే ఉప్పెన వంటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి టాలీవుడ్‌ లో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   15 Dec 2023 8:17 AM GMT
LIC లో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ
X

చిన్న వయసులోనే ఉప్పెన వంటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి టాలీవుడ్‌ లో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఉప్పెన లో కృతి శెట్టి పోషించిన బేబమ్మ పాత్ర ఇప్పటికి కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఉప్పెన తర్వాత ఈ అమ్మడు నటించిన ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి.


కృతి శెట్టి కి ఉప్పెన తర్వాత ఆ స్థాయి కమర్షియల్‌ హిట్‌ దక్కలేదు. పైగా ఈ మధ్య కాలంలో ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి. దాంతో టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఆఫర్లే కరువయ్యాయి. దాంతో తమిళ్‌ సినీ ఇండస్ట్రీ వైపు ఈ అమ్మడు అడుగులు వేసింది. అక్కడ పలు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.

తాజాగా ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో లవ్‌ టుడే హీరో ప్రదీప్‌ రంగనాధన్‌ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఎస్‌ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి.

‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' (LIC) అనే విభిన్నమైన టైటిల్‌ తో ప్రదీప్‌ రంగనాధన్‌, కృతి శెట్టి జోడీగా విఘ్నేష్ శివన్ సినిమా ను చేయబోతున్నాడు. ఈ సినిమాను సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో మరియు రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌ లో నిర్మిస్తున్నారు. నయనతార ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

విఘ్నేష్ శివన్‌ గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా ప్రదీప్‌ రంగనాధన్‌ గత చిత్రం లవ్‌ టుడే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కచ్చితంగా కృతి శెట్టికి విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఆమె అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.