Begin typing your search above and press return to search.

అందాల బేబమ్మ సోషల్‌ మీడియా షో స్టార్ట్‌

తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు కృతి అందాల షో స్టార్ట్‌ అన్నట్లుగా హింట్‌ ఇస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 10:30 AM GMT
అందాల బేబమ్మ సోషల్‌ మీడియా షో స్టార్ట్‌
X

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ కమర్షియల్‌ గా సక్సెస్ అవ్వాలి, స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవాలి అంటే కచ్చితంగా అందాల ఆరబోత చేయాల్సి ఉంటుంది. అలా అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తేనే మంచి ఆఫర్లు వస్తాయి.

ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభం నుంచి కూడా కాస్త అందాల ప్రదర్శన కి దూరంగా ఉంటూ వస్తోంది. ఆమెను ఒక పద్దతైన అమ్మాయిగా ప్రేక్షకులు చూశారు.. తాను కూడా అలాగే ఉండాలి అనుకుంది.

వరుసగా వచ్చిన ఆఫర్లు నిరాశ పరచడంతో బేబమ్మ అలియాస్‌ కృతి శెట్టి రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్ గా అందాల ప్రదర్శన చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో స్కిన్‌ షో ఫోటోలు షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఓ రేంజ్ లో అందాల ప్రదర్శణ చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరింతగా స్కిన్‌ షో చేసేందుకు సిద్ధం అన్నట్లుగా సిగ్నల్‌ ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు కృతి అందాల షో స్టార్ట్‌ అన్నట్లుగా హింట్‌ ఇస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం ఒకే ఒక సినిమా చేతిలో ఉంది. అదే శర్వా తో నటిస్తున్న సినిమా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే వాటికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. శర్వా తో చేస్తున్న సినిమా హిట్‌ అయితే కృతి మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.