Begin typing your search above and press return to search.

వీడియో : బెల్లీ డాన్స్ డాన్స్‌ తో కుమ్మేసిన బేబీ

ఈ మధ్య కాలంలో డాన్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న కృతి శెట్టి బెల్లీ డాన్స్ లో మంచి ప్రావిణ్యం సాధించినట్లుగా ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 5:46 AM GMT
వీడియో : బెల్లీ డాన్స్ డాన్స్‌ తో కుమ్మేసిన బేబీ
X

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బ్యాక్‌ టు బ్యాక్ ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకుంది. కెరీర్‌ ఆరంభంలో వరుసగా మూడు సినిమాలతో హిట్ కొట్టి లక్కీ బ్యూటీ అనే ట్యాగ్ దక్కించుకుంది.

అంతలోనే వరుసగా ఫ్లాప్స్ పడటంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం తెలుగు లో పెద్ద ఆఫర్లు ఏమీ లేవు. తమిళంలో మాత్రం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కెరీర్‌ మొదటి నుంచి కూడా ఈ అమ్మడు స్కిన్‌ షో కి దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెల్సిందే.

స్కిన్‌ షో చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ఫోటో లేదా వీడియో షేర్‌ చేస్తే కచ్చితంగా అది వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ అమ్మడు తన బెల్లీ డాన్స్ వీడియోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ మధ్య కాలంలో డాన్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న కృతి శెట్టి బెల్లీ డాన్స్ లో మంచి ప్రావిణ్యం సాధించినట్లుగా ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. అరబిక్ కుత్తు పాటకు ఈ అమ్మడు వేసిన బెల్లీ డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అందంతో పాటు నటన విషయంలో కూడా ఈ అమ్మడు ఎప్పుడు విమర్శలు పొందలేదు. కానీ కాలం కలిసి రాకపోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడి ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కడం లేదు. మళ్లీ ఈ అమ్మడికి మంచి టైమ్‌ వస్తుందనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.