ఆ రెండిటి మీదే బేబమ్మ ఆశలు..!
ఉప్పెన తో తొలి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది మంగుళూరు భామ కృతి శెట్టి.
By: Tupaki Desk | 13 April 2025 4:50 AMఉప్పెన తో తొలి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది మంగుళూరు భామ కృతి శెట్టి. ఆ సినిమాలో బేబమ్మగా ఆమె చూపించిన అభినయానికి యూత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన కృతి శెట్టి వరుస ఆఫర్లతో అదరగొట్టేసింది. ఐతే ఆఫర్లైతే వచ్చాయి కానీ వాటిని సక్సెస్ లుగా మలచుకోవడంలో విఫలమైంది అమ్మడు. అందుకే వరుస ఫ్లాపులు అమ్మడిని పలకరించాయి.
ముఖ్యంగా ఐదు సినిమాలు రిజల్ట్ తేడా కొట్టడంతో కెరీర్ రిస్క్ లో పడింది. తెలుగులో ఇప్పటికీ తనకో మంచి ఛాన్స్ వస్తే టాలెంట్ చూపించాలని చూస్తుంది కృతి శెట్టి. లాస్ట్ ఇయర్ శర్వానంద్ తో మనమే సినిమా చేయగా అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే టాలీవుడ్ లో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి. ఇక తెలుగులో వల్ల కావట్లేదని కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది కృతి శెట్టి.
బేబమ్మ ప్రస్తుతం తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తుంది. అందులో ఒకటి సూపర్ హిట్ ఫాం లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ తో ఎల్.ఐ.కె చేస్తుంది. ప్రదీప్ సినిమాలన్నీ యూత్ ఎంటర్టైనర్స్ గా వస్తున్నాయి. ఈ సినిమా కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని టాక్. ఈ సినిమాతో పాటు రవి మోహన్ హీరోగా వస్తున్న జినీ సినిమాలో కూడా కృతి శెట్టి నటిస్తుంది. అమ్మడు ఈ రెండు సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకుంది.
ఈ రెండు సినిమాలు హిట్టైతే కెరీర్ కాస్త గాడిన పడే ఛాన్స్ ఉంటుంది. మరోపక్క మలయాళంలో అమ్మడు చేసిన ఏ.ఆర్.ఎం సినిమా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. సో అక్కడ నెక్స్ట్ సినిమా ఛాన్స్ ల కోసం వెయిట్ చేస్తుంది బేబమ్మ. మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు.
అంతేకాదు కెరీర్ మొదట్లో గ్లామర్ షోకి ఏమాత్రం ఛాన్స్ లేదన్నట్టుగా ఉన్న ఈ కృతి శెట్టి ఇప్పుడు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్పకుండా స్కిన్ షోకి కూడా రెడీ అనేలా ఉంది. మరి బేబమ్మ ఆశలు నెరవేరేలా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి. బుచ్చి బాబు డైరెక్షన్ లో రాం చరణ్ చేస్తున్న పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే చేయాలని అనుకుంటున్న కృతి శెట్టికి అలాంటి అవకాశం లేదన్నట్టుగానే తెలుస్తుంది. ఐతే టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ కోసం చూస్తున్న అమ్మడికి త్వరలోనే లక్ కలిసి రావాలని కోరుతున్నారు బేబమ్మ ఫాలోవర్స్.