కృతి శెట్టి ఈసారి గట్టిగానే..?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో తన అభినయంతో మెప్పించింది.
By: Tupaki Desk | 14 July 2025 1:15 AM ISTఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో తన అభినయంతో మెప్పించింది. సినిమాలో ఆమెను చూసి పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవిలా అనిపించింది. ఉప్పెన బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆ తర్వాత వరుస ఛాన్స్ లు అందుకుంది కృతి శెట్టి. ఐతే అవకాశాలైతే వచ్చాయి కానీ వాటిని సక్సెస్ లుగా మలచుకోవడంలో అమ్మడు ఫెయిల్ అయ్యింది. ఫలితంగా ఎంత త్వరగా సూపర్ క్రేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా గ్రాఫ్ పడిపోయేలా చేసుంది.
తెలుగులో వరుస ఫ్లాపుల వల్ల కృతి శెట్టి తమిళ పరిశ్రమకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఎల్.ఐ.కె, జినీ సినిమాల్లో నటిస్తుంది. కృతి శెట్టి ఈమధ్య మలయాళంలో కూడా ఏ.ఆర్.ఎం అంటూ ఒక ప్రయత్నం చేసింది. ఐతే కృతి శెట్టి మిగతా పరిశ్రమల కన్నా తనకు మొదటి సక్సెస్ ఇచ్చిన తెలుగు పరిశ్రమ మీద ఆసక్తిగా ఉంది. ఇక్కడేమో ఆమెకు పెద్దగా అవకాశాలు ఇవ్వట్లేదు.
కృతి శెట్టి మాత్రం ఈసారి గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా రొటీన్ కథలు వద్దని.. కథలో కొత్తదనం లేదా పాత్రలో కొత్తదనం ఉంటేనే చేయాలని అనుకుంటుందట. ఈమధ్య తెలుగు నుంచి ఒక ఆఫర్ వచ్చినా కూడా కృతి శెట్టి తిరస్కరించిందట. ఎందుకంటే అమ్మడికి అది రొటీన్ రోల్ అనిపించిందట. కథ బాగున్నా అందులో తన రోల్ పాటలు, రెండు సీన్స్ కోసం అన్నట్టె ఉందట.
అందుకే కృతి శెట్టి ఆ సినిమాను కాదనేసింది. సో ఇక మీదట ఉప్పెన బేబమ్మని మంచి మంచి రోల్స్ లో చూసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. బయట ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే తెలుగు పరిశ్రమ మీదే కృతి శెట్టి ప్రేమ చూపించడానికి మరో రీజన్. ఇక్కడ స్టార్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా బొమ్మలే కాబట్టి కృతి శెట్టి ఒక్క పాన్ ఇండియా ఛాన్స్ అందుకుంటే మాత్రం ఆమె దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. మరి బేబమ్మ లక్ ఎలా ఉంది అన్నది చూడాలి. కృతి శెట్టికి హిట్టు పడితే ఉప్పెన భమకి మళ్లీ పాత రోజులు గుర్తు తెచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి రొటీన్ కాదంటూ కృతి చేస్తున్న రాబోయే సినిమాల వల్ల ఆమెకు ఎలాంటి క్రేజ్ వస్తుందో చూడాలి.
