కృతి శెట్టి మకాం ముంబైకి మార్చేసిందా?
ముంబై బ్యూటీ కృతి శెట్టి తెలుగు తెరపై కనిపించి ఏడాది దాటింది. అప్పటికే అమ్మడి కెరీర్ కి సరైన సక్సెస్ లేక తబడాటులో ఉంది.
By: Tupaki Desk | 13 July 2025 8:00 PM ISTముంబై బ్యూటీ కృతి శెట్టి తెలుగు తెరపై కనిపించి ఏడాది దాటింది. అప్పటికే అమ్మడి కెరీర్ కి సరైన సక్సెస్ లేక తబడాటులో ఉంది. అదీ రాకరాక వచ్చిన అవకాశం. ఆ ఛాన్స్ కూడా వైఫల్యంతో ముగిసింది. టాలీవుడ్ లో `ఉప్పెన్` తో లాంచ్ అయిన ఈ బ్యూటీ తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోయిన్ అవ్వడం ఖాయమనుకున్నారంతా. అందం..అభినయం అన్నీ కలగలిపిన నాయికగా గుర్తింపు ముద్ర పడింది. సాధారణంగా ముంబై భామలకు పెర్పార్మర్ గా అంత ఈజీగా గుర్తింపు రాదు.
సౌత్ భామల్లో ఉన్నంత నటనలో సహజత్వం వాళ్లలో కనిపించదు. కానీ కృతిశెట్టి నేచురల్ పెర్పార్మెన్స్ కి జనాలు కనెక్ట్ అయ్యారు. కానీ ఆ సక్సెస్ ని మాత్రం అమ్మడు కొనసాగింలేకపోయింది. ఈ క్రమంలో కొంత కాలంగా తమిళ సినిమాలే చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న రెండు కోలీవుడ్ చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. `లవ్ ఇన్సురెన్స్ కంపెనీ`, `జెనీ` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎల్ ఐసీ సినిమాపై మంచి అంచనున్నాయి.
ఇందులో ప్రదీప్ రంగనాధ్ హీరో. విగ్నేష్ శవన్ దర్శకత్వంలో నయనతార నిర్మిస్తోన్న చిత్రం కావడంతో మంచి బజ్ ఉంది. త్వరలోనే ఈసినిమా రిలీజ్ అవుతుంది. అయితే తాజాగా కృతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. కృతి కోలీవుడ్ లో కెరీర్ మొదలైన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చేసింది. కొంత కాలంగా తండ్రితో కలిసి అక్కడే ఉంటుంది. అయితే తాజాగా బ్యూటీ చెన్నై నుంచి ముంబైకి షిప్ట్ అయిందిట.
దీంతో కోలీవుడ్ లో కొత్త అవాశాలు లేకపోవడంతో మకాం మార్చినట్లు ప్రచారం మొదలైంది. బహుశా బాలీవుడ్ ప్రయత్నాల్లో భాగంగా షిప్ట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. అమ్మడి బాలీవుడ్ కెరీర్ `సూపర్ 30` తో మొదలైంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఆ సినిమా బాగానే ఆడింది. కానీ ఆతర్వాత కృతికి అక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. మళ్లీ ఇప్పుడు సొంత గూటికే చేరుకుంది.
