Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : అందమైన స్టైలిష్‌ బేబమ్మ!

ఉప్పెన తర్వాత కూడా ఈమె నటించిన రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   28 March 2025 4:57 PM
పిక్‌టాక్‌ : అందమైన స్టైలిష్‌ బేబమ్మ!
X

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాప్‌ స్టార్ హీరోయిన్స్‌ సరసన నిలిచింది. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో అర డజనుకు పైగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఉప్పెన తర్వాత కూడా ఈమె నటించిన రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత నుంచి ఈమె డౌన్ ఫాల్‌ మొదలైంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడి యొక్క క్రేజ్ తగ్గింది. ఇటీవల ఈమెకు తెలుగులో సినిమా ఛాన్స్‌లే దక్కడం లేదు. అయితే తమిళ్‌, మలయాళంలో ఈమె సినిమాలు చేస్తోంది.


తెలుగులో చివరగా ఈమె శర్వానంద్‌తో కలిసి మనమే సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరచింది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. సోషల్‌ మీడియాలో కృతి శెట్టికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈమె నటించిన సినిమాల వల్ల కంటే సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం వల్ల వార్తల్లో నిలుస్తుంది. దాదాపుగా 9 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిగి ఉన్న ఈమె తన ఫాలోవర్స్‌ కోసం అందమైన ఫోటోలను రెగ్యులర్‌గా షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి ఈమె తన అందమైన స్టైలిష్‌ లుక్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.


ఒక అవార్డ్‌ వేడుకలో కృతి శెట్టి ఈ స్టైలిష్ ఔట్‌ ఫిట్‌లో కనిపించింది. బోల్డెన్‌ కలర్‌లో టాప్‌తో బ్లాక్ కలర్‌ బోటమ్‌తో కృతి శెట్టి ఆకట్టుకుంది. పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే చూపించాల్సినంత చూపిస్తూ ఆకట్టుకున్న కృతి శెట్టి ఫోటోలు ఎప్పటిలాగే వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం అంటూ ఉంటారు. ఈ ఫోటోల్లో మరోసారి కృతి శెట్టి తన అందమైన రూపంతో సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే ఈ ఫోటలతో కృతి శెట్టి మరికొన్ని సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు.


ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో కనిపించిన కృతి శెట్టి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతలోనే వరుస ఫ్లాప్స్ కారణంగా ఆఫర్లు కోల్పోయింది. ప్రస్తుతం మలయాళం, తమిళ్‌లో చేస్తున్న సినిమాల కారణంగా మరోసారి టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి. ఇలాంటి అందమైన ఫోటో షూట్స్ కారణంగా చాలా మంది హీరోయిన్స్ పోయిన ఆఫర్లను సొంతం చేసుకున్నారు. కనుక ఈమె సైతం మళ్లీ టాలీవుడ్‌ నుంచి పిలుపు రావాలంటే ఇలాంటి అందమైన స్టైలిష్ ఫోటో షూట్స్‌ను షేర్‌ చేయాల్సిన అవసరం ఉందని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.